ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Bangalore Record Chase: చారిత్రాత్మక ఛేజ్ నమోదు చేసిన బెంగళూరు..తర్వాత పోరు క్వాలిఫయర్ 1లో..

ABN, Publish Date - May 28 , 2025 | 07:34 AM

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు చరిత్ర సృష్టించింది. లక్నో సూపర్ జయింట్స్‌పై నిన్న జరిగిన మ్యాచులో 228 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి, ఐపీఎల్ 2025లో క్వాలిఫయర్ 1కి చేరింది. ఈ క్రమంలో లక్నోలోని ఎకానా స్టేడియంలో ఇది అత్యధిక స్కోరు ఛేజింగ్‌గా (Bangalore Record Chase) నిలిచింది.

Bangalore Record Chase

ఐపీఎల్ 2025లో మంగళవారం, మే 27న లక్నో సూపర్ జైయింట్స్ (LSG)తో జరిగిన మ్యాచ్‌లో 228 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి, RCB ప్లేఆఫ్స్‌లోకి ప్రవేశించింది. ఇది లక్నోలోని ఎకానా స్టేడియంలో అత్యధిక పరుగుల (Bangalore Record Chase) ఛేదనగా నిలిచింది. ఆర్‌సీబీ లీగ్ దశలో అన్ని ఏడు అవే మ్యాచ్‌లను గెలిచిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. లక్నోలో ఇది అత్యధిక ఛేజింగ్, ఆర్‌సీబీ చేసిన అత్యధిక ఛేజింగ్, ఐపీఎల్‌లో మూడో అత్యధిక ఛేజింగ్‌గా నిలిచింది. ఈ విజయంతో RCB ప్లేఆఫ్స్‌లోకి ప్రవేశించింది. తద్వారా, వీరు క్వాలిఫయర్ 1లో పంజాబ్ కింగ్స్‌తో గురువారం తలపడతారు. ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ శుక్రవారం జరుగుతుంది.


లక్నో సూపర్ జైయింట్స్ బ్యాటింగ్

మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జైయింట్స్ 227/3 స్కోరు సాధించింది. కెప్టెన్ రిషభ్ పంత్ తన రెండో ఐపీఎల్ శతకాన్ని నమోదు చేశాడు. 61 బంతుల్లో 118 పరుగులు చేశాడు. మిచెల్ మార్ష్ కూడా 37 బంతుల్లో 67 పరుగులు చేసి మంచి భాగస్వామ్యాన్ని అందించాడు.


బెంగళూరు అద్భుతమైన బ్యాటింగ్

RCB 90/3 వద్ద కష్టాల్లో ఉన్నప్పుడు, జితేష్ శర్మ (85 బంతుల్లో 33 పరుగులు, 8 ఫోర్లు, 6 సిక్సులు), మయాంక్ అగర్వాల్ (23 బంతుల్లో 41 పరుగులు, 5 ఫోర్లు) అద్భుతమైన భాగస్వామ్యాన్ని అందించారు. వీరిద్దరూ కలిసి 14వ నుంచి 16వ ఓవర్లలో 50 పరుగులు సాధించారు. తరువాత, 17వ ఓవర్‌లో దివ్గేష్ సింగ్ రాథి వేసిన బ్యాక్‌ఫుట్ నోబాల్ కారణంగా జితేష్ శర్మ సేఫ్ అయ్యాడు. ఆ తర్వాత, 19వ ఓవర్‌లో సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించారు. ఈ అద్భుత విజయంతో RCB అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు. ప్లేఆఫ్స్‌లో మరింత అద్భుతంగా ఆడాలని, ఈసారి ఆర్‌సీబీ టైటిల్ గెలవాలని భావిస్తున్నారు.


టాస్ సమయంలో జితేష్, పంత్ ఏమన్నారంటే..

రజత్ పటీదార్ గాయం కారణంగా జితేష్ శర్మ స్టాండ్ ఇన్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. మేం మొదట బౌలింగ్ చేస్తాం. పిచ్ మంచిగా ఉంది. ఛేజ్ చేయడానికి అనుకూలం. రజత్ ఇంపాక్ట్ ప్లేయర్. టిమ్ డేవిడ్ బదులు తుషారా ఆడతారని జితేష్ అన్నాడు. ఇక రిషభ్ పంత్ మాట్లాడుతూ మాకు బ్యాటింగ్ లేదా బౌలింగ్ ఏదైనా సరే. గత మ్యాచ్‌లో మా సామర్థ్యం కొంత చూపాం. ఈ మ్యాచులో చివరి బంతి వరకు 100 శాతం ఎఫర్ట్ ఇస్తామన్నారు. బ్రీట్జ్‌కే, దిగ్వేష్ రాఠీ జట్టులోకి వచ్చారని వెల్లడించాడు.


ఇవీ చదవండి:

టీసీఎస్‌ ఏఐ.క్లౌడ్‌ వ్యాపార విభజన

సీక్రెట్ కోడ్ ట్రిక్స్.. సైబర్ నేరాలకు చెక్‌..

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 28 , 2025 | 09:10 AM