GT vs SRH Prediction: నేటి హైదరాబాద్ vs గుజరాత్ మ్యాచ్ విన్ ప్రిడిక్షన్..మనోళ్లు గెలుస్తారా లేక..
ABN, Publish Date - May 02 , 2025 | 08:25 AM
GT vs SRH Prediction:ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025లో నేడు (మే 2న) గుజరాత్ టైటాన్స్ (GT), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. గుజరాత్ అహ్మదాబాద్‌లోని మోదీ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు జరగనున్న ఈ మ్యాచులో ఏ జట్టు గెలిచే ఛాన్సుంది, ఏంటనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఐపీఎల్ 2025 18వ సీజన్ క్రమంగా చివరి దశకు వచ్చేసింది. ఈ సీజన్‌లో 51వ మ్యాచ్ నేడు గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు జరుగుతుంది. ఇప్పటివరకు, టోర్నమెంట్‌లో గుజరాత్ జట్టు ప్రదర్శన బాగుంది. ఆడిన 9 మ్యాచ్‌ల్లో గుజరాత్ 6 గెలిచి 3 ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో గుజరాత్ 12 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. మరోవైపు గత సీజన్ ఫైనలిస్ట్ సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రస్తుత సీజన్‌లో పేలవమైన స్థితిలో ఉంది. హైదరాబాద్ 9 మ్యాచ్‌ల్లో 3 గెలిచి 6 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. హైదరాబాద్ -1.103 నికర రన్ రేట్‌తో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. అయితే ఈ మ్యాచులో ఏ జట్టు గెలిచే అవకాశం(GT vs SRH Prediction) ఉందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వర్షం ఉందా..
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం బ్యాటింగ్ చేయడానికి ఉత్తమమైన మైదానాలలో ఒకటిగా ఉంది. ఈ సీజన్‌లో నాలుగు మ్యాచ్‌లలో సగటు మొదటి ఇన్నింగ్స్ స్కోరు 215. నాలుగు మ్యాచ్‌లలో మూడింటిని ముందుగా బ్యాటింగ్ చేసిన జట్లు గెలిచాయి. ఈ మైదానంలో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. అహ్మదాబాద్‌లో జరిగే GT vs SRH మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం లేదు. గరిష్ట ఉష్ణోగ్రత 44 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీలు ఉంటుందని అంచనా.
ఎవరు గెలుస్తారు
గుజరాత్ టైటాన్స్ (GT), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య ఇప్పటివరకు జరిగిన (GT vs SRH Prediction) ఐదు మ్యాచ్‌లలో GT 4-1 ఆధిక్యంలో ఉంది. అహ్మదాబాద్‌లో రెండు జట్ల మధ్య జరిగిన రెండు మ్యాచ్‌లలో GT గెలిచింది. పాయింట్ల పట్టిక గురించి మాట్లాడుకుంటే GT తొమ్మిది మ్యాచ్‌ల్లో ఆరు మ్యాచ్‌ల్లో గెలిచి టాప్-4లో ఉంది, అదే సమయంలో ఆరు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన SRH పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. ఇక గూగుల్ విన్ ప్రిడిక్షన్ అంచనా ప్రకారం చూస్తే గుజరాత్ 55 శాతం గెలిచేందుకు అవకాశం ఉండగా, హైదరాబాద్ జట్టుకు 45 శాతం ఛాన్సుంది. అయితే ఇది ఒక అంచనా మాత్రమే. ఇలానే తప్పకుండా జరుగుతుందని చెప్పలేం.
గుజరాత్ టైటాన్స్ ప్లేయింగ్ 11 అంచనా:
సాయి సుదర్శన్, శుభమన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్, కరీం జనత్, రషీద్ ఖాన్, సాయి కిషోర్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ
సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ 11 అంచనా:
అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అనికేత్ వర్మ, కమిందు మెండిస్, నితీష్ కుమార్ రెడ్డి, పాట్ కమిన్స్ (కెప్టెన్), హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, మహమ్మద్ షమీ
ఇవి కూడా చదవండి:
Mumbai Indians: అగ్రస్థానం చేరుకున్న ముంబై ఇండియన్స్.. ఆసక్తికరంగా ప్లేఆఫ్
Bank Holidays: మే 2025లో 12 రోజులు బ్యాంకులు బంద్.. పూర్తి లిస్ట్ ఇదే
Donald Trump:100 రోజుల్లో ట్రంప్ తుఫాన్..ఒప్పందాల నుంచి ఒడిదొడుకుల దాకా..
Read More Business News and Latest Telugu News
Updated Date - May 02 , 2025 | 09:09 AM