Donald Trump:100 రోజుల్లో ట్రంప్ తుఫాన్..ఒప్పందాల నుంచి ఒడిదొడుకుల దాకా..
ABN , Publish Date - Apr 30 , 2025 | 01:10 PM
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి తన పదవీకాలం మొదటి 100 రోజులు పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన ఇప్పటివరకు ఎన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందనే విషయాలను ఇప్పుడు చూద్దాం.

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ తన రెండోసారి పదవీకాలంలో 100 రోజులు విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశానికి బాధ్యతలు స్వీకరించిన తర్వాత, ట్రంప్ అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆయన నిర్ణయాలు ప్రపంచంలోని అన్ని దేశాలలో భయాందోళనలను సృష్టించాయని చెప్పవచ్చు. ట్రంప్ పరిపాలనలో భాగంగా మొదటి 100 రోజులు కార్యనిర్వాహక చర్యలు, బహిష్కరణలు, సమాఖ్య సిబ్బంది తగ్గింపులు, సుంకాల రేట్ల పెరుగుదల, ఇతర చర్యలతో కూడిన నిర్ణయాలు ఉన్నాయి.
గతంలో లేని విధంగా..
ట్రంప్ పదవీకాలం మొదటి 100 రోజులు పూర్తయిన సందర్భంగా మిచిగాన్‌లో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ పట్ల ట్రంప్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మాట్లాడిన ట్రంప్ 'నేను మన దేశాన్ని, ప్రపంచాన్ని నడుపుతున్నానని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో నేను చేస్తుంది, ఎన్నికల ప్రచారం చేసిన వాటినే అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో ట్రంప్ ఏటా బిలియన్ డాలర్ల విలువైన కొత్త దిగుమతి పన్నులను విధించారు. అంటే దాదాపు 140 ఆదేశాలపై సుంకాలు జారీ చేయడం ద్వారా, ఫ్రాంక్లిన్ డి.రూజ్‌వెల్ట్ అధ్యక్ష పదవి కాలం నుంచి చూడని విధంగా ట్రంప్ ముందుకెళ్తున్నారు.
మరోవైపు ఆరోపణలు..
కాంగ్రెస్ (US పార్లమెంట్)ఆమోదం లేకుండా, ట్రంప్ ఏటా బిలియన్ల డాలర్ల విలువైన కొత్త దిగుమతి పన్నులను విధించారు. పెద్ద ఎత్తున తొలగింపులు చేయడం ద్వారా సమాఖ్య బ్యూరోక్రసీని పునర్నిర్మించారని పలువురు ఆరోపిస్తున్నారు. అంతేకాదు ట్రంప్ పరిపాలనలో వైద్యం, పోషకాహారం, విద్య, యువ కుటుంబాల ఆరోగ్యం, విపత్తు ఉపశమనం వరకు ప్రతిదానికీ దాదాపు $430 బిలియన్ల సమాఖ్య నిధులను నిరోధించారని అంటున్నారు. ఆ క్రమంలో లెక్కలేనన్ని అమెరికన్ల సంక్షేమ కార్యక్రమాలపై ఇది ప్రమాదకరమైన దాడి అని డెమోక్రటిక్ పార్టీ అగ్ర నాయకులు వ్యాఖ్యలు చేశారు. అమెరికన్ ప్రజలపై ఖర్చు చేయడానికి బదులుగా, అధ్యక్షుడు ట్రంప్ చట్టాలను విస్మరిస్తూ వనరులను దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. ఏ అమెరికన్ అధ్యక్షుడు కూడా అమెరికా దేశ చట్టాలను ఇంతలా విస్మరించలేదని ఆరోపించారు. దీంతోపాటు అనేక మంది ప్రజలు కూడా ట్రంప్ పాలన పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.
కానీ బైడెన్ పాలనలో..
కేవలం 100 రోజుల్లోనే ట్రంప్ 140 కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేయగా, ఆయన ముందున్న జో బైడెన్ తన నాలుగేళ్ల కాలంలో సంతకం చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వుల సంఖ్య 162 మాత్రమే కావడం విశేషం. ట్రంప్ ఇటీవల సుంకాల ఎజెండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేసింది. ఫెంటానిల్ (నొప్పి నివారిణి) అక్రమ రవాణాకు సంబంధించి అమెరికా రెండు అతిపెద్ద వాణిజ్య భాగస్వాములైన మెక్సికో, కెనడాలపై ఆయన 25 శాతం వరకు సుంకాలను విధించారు. దీంతోపాటు ఆటోలు, ఉక్కు, అల్యూమినియంపై దిగుమతి సుంకాలను విధించారు. ఏప్రిల్ 2న ఆయన డజన్ల కొద్దీ దేశాలపై సుంకాలను విధించారు.
ఇవి కూడా చదవండి:
Bank Holidays: మే 2025లో 12 రోజులు బ్యాంకులు బంద్.. పూర్తి లిస్ట్ ఇదే
NaBFIDలో అనలిస్టు పోస్టులకు నోటిఫికేషన్.. రూ.14 లక్షల జీతంతో మంచి ఛాన్స్
Read More Business News and Latest Telugu News