ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Virat Kohli: కోహ్లీకి మైండ్ దొబ్బింది.. టీమిండియా సీనియర్ సీరియస్!

ABN, Publish Date - May 19 , 2025 | 04:39 PM

టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీని ఉద్దేశించి ఓ సీనియర్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. విరాట్‌కు మైండ్ దొబ్బిందని, అందుకే రిటైర్‌మెంట్ ఇచ్చేశాడని అన్నాడు. మరి.. ఎవరా సీనియర్ క్రికెటర్ అనేది ఇప్పుడు చూద్దాం..

Virat Kohli

భారత జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్టులకు రిటైర్‌మెంట్ ప్రకటించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒత్తిడి తగ్గింది కాబట్టి వన్డేల మీద అతడు ఫుల్ ఫోకస్ పెట్టొచ్చంటూ కొందరు సానుకూల వ్యాఖ్యలు చేస్తుంటే.. ఫామ్, ఫిట్‌నెస్‌తో పాటు అతడిలో ఎంతో క్రికెట్ మిగిలి ఉన్నా ఇలా అర్ధంతరంగా సుదీర్ఘ ఫార్మాట్ నుంచి తప్పుకోవడం సరికాదని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ తరుణంలో టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. విరాట్‌కు మైండ్ దొబ్బిందని, అందుకే రిటైర్‌ అయ్యాడని అన్నాడు. మరి.. తివారీ ఎందుకిలా మాట్లాడాడో ఇప్పుడు చూద్దాం..


చేజేతులా వదులుకున్నాడు!

ఎంతటి గొప్ప ఆటగాడికైనా ఒక దశలో మెదడు స్తబ్దుగా మారిపోతుందని, అలాంటి సమయంలో పెద్దగా ఆలోచించకుండా హడావుడిగా నిర్ణయాలు తీసుకుంటారని మనోజ్ తివారీ అన్నాడు. కోహ్లీ విషయంలోనూ ఇలాగే జరిగి ఉండొచ్చన్నాడు. అతడిలో ఇంకా ఎంతో క్రికెట్ మిగిలి ఉందన్నాడు తివారీ. 10 వేల పరుగులకు చేరువలో విరాట్‌ ఉన్నాడని.. ఇలాంటి సమయంలో రిటైర్‌ అవ్వాలనుకోవడం సరికాదన్నాడు. 10 వేల పరుగుల మైలురాయి అనేది కోహ్లీకి పెద్ద విషయం కాకపోవచ్చని.. కానీ టెస్టులు ఆడాలని కలలుగనే క్రికెటర్లకు ఈ మైల్‌స్టోన్‌ చాలా పెద్దదని తెలిపాడు. దీన్ని అందుకునే అవకాశం కోహ్లీకి ఉందని, కానీ అతడు చేజేతులా వదులుకున్నాడని పేర్కొన్నాడు.


కళ్లు మూసుకొని..

రిటైర్‌మెంట్ విషయంలో కోహ్లీ తీసుకున్న నిర్ణయం సరికాదన్నాడు మనోజ్ తివారీ. అతడు ఎందుకీ డెసిషన్ తీసుకున్నాడో తనకు అర్థం కావట్లేదన్నాడు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే అతడితో పాటు భారత క్రికెట్‌కూ ఎంతో మేలు చేకూరుతుందన్నాడు తివారీ. ఎంత వీలైతే అంత త్వరగా అతడు కళ్లు మూసుకొని రిటైర్‌మెంట్ డెసిషన్‌ను వెనక్కి తీసుకోవాలని కోరాడు. విరాట్ గనుక తన నిర్ణయంపై వెనక్కి తగ్గితే అభిమానులకు అంతకుమించిన సంతోషం ఏదీ ఉండదని, ఫ్యాన్స్ ముఖాల్లో చిరునవ్వులు వీస్తాయని మనోజ్ తివారీ పేర్కొన్నాడు.


ఇవీ చదవండి:

టీమిండియా కోసం మందు మానేశాడ

ఆర్సీబీలోకి ఎక్స్‌ప్రెస్ బౌలర్

ఈసారి ఆసియా కప్ జరగనట్టే?

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 19 , 2025 | 04:44 PM