ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Yuzvendra Chahal: గాయాలతో పోరాటం.. చాహల్ పట్టుదలకు గర్ల్‌ఫ్రెండ్ ఫిదా!

ABN, Publish Date - Jun 06 , 2025 | 02:41 PM

టీమిండియా సీనియర్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఈ ఐపీఎల్ సీజన్‌లో అదరగొట్టాడు. పంజాబ్ కింగ్స్ ఫైనల్‌కు చేరుకోవడంలో కీలకపాత్ర పోషించాడు.

Yuzvendra Chahal

టీమిండియా సీనియర్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఎప్పటిలాగే ఈసారీ ఐపీఎల్‌లో అదరగొట్టాడు. పంజాబ్ కింగ్స్ తరఫున బరిలోకి దిగిన చాహల్.. 14 మ్యాచుల్లో 16 వికెట్లు పడగొట్టాడు. టోర్నమెంట్ ఆసాంతం వికెట్ల మీద వికెట్లు తీస్తూ వచ్చాడు. కీలక సమయాల్లో బ్రేక్‌త్రూలు అందిస్తూ టీమ్ విజయాల్లో ముఖ్యభూమిక పోషించాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఫైనల్‌లో 4 ఓవర్లు వేసి 37 పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు చాహల్. పంజాబ్ ట్రోఫీ నెగ్గకపోయినా అతడు తన ఆటతీరుతో అభిమానుల మనసులు దోచుకున్నాడు. ఈ విషయంపై చాహల్ కొత్త గర్ల్‌ఫ్రెండ్ ఆర్జే మహ్వాష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అతడు గాయాలతో పోరాటం చేస్తూనే టోర్నీలో ఆడాడని రివీల్ చేసింది. ఇంతకీ మహ్వాష్ ఏం చెప్పిందంటే..


గాయాలతో ఉక్కిరిబిక్కిరి..

ఐపీఎల్-2025 ఫైనల్‌లో ఆర్సీబీ చేతుల్లో పంజాబ్ ఓడిన తర్వాత ఆర్జే మహ్వాష్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టింది. చాహల్ ఆటతీరు, అతడి సంకల్పం, గేమ్ మీద అతడికి ఉన్న దృక్పథం, గాయాలబెడద లాంటివి ఈ పోస్ట్‌లో ప్రస్తావించిందామె. ‘ఆర్సీబీతో ఫైనల్ ఫైట్‌లో పంజాబ్ చివరి వరకు చాలా బలంగా పోరాడింది. చాహల్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఈ టోర్నమెంట్‌లో ఆడిన రెండో మ్యాచ్‌లోనే చాహల్‌ పక్కటెముకలకు గాయమైంది. అనంతరం అతడి బౌలింగ్ చేసే వేలికి కూడా దెబ్బ తగిలింది. ఇక్కడితో అయిపోలేదు. ఆ తర్వాత మరో గాయం బారిన పడ్డాడు. ఇలా మూడు గాయాలతో సీజన్ మొత్తం ఆడుతూ వచ్చాడు. ఎక్కడా వెనుకంజ వేయకుండా నొప్పిని పంటి కింద భరిస్తూనే కొనసాగాడు. అతడు నిజమైన పోరాట యోధుడు’ అని మహ్వాష్ ఆ పోస్ట్‌లో రాసుకొచ్చింది.


ఇవీ చదవండి:

గార్డెన్‌లో రోహిత్.. పంత్ డైలాగ్ వైరల్!

బుమ్రా లేకపోయినా బేఫికర్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 06 , 2025 | 02:41 PM