ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

RCB vs SRH Toss: టాస్ నెగ్గిన ఆర్సీబీ.. సన్‌రైజర్స్‌కు బంపర్ చాన్స్!

ABN, Publish Date - May 23 , 2025 | 07:05 PM

ఆర్సీబీ-సన్‌రైజర్స్ మ్యాచ్ షురూ అయింది. టాస్ నెగ్గిన బెంగళూరు ఏం ఎంచుకుంది.. తొలుత ఎవరు బ్యాటింగ్‌కు దిగుతారు.. అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

RCB vs SRH Toss

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు-సన్‌రైజర్స్ హైదరాబాద్ పోరు ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ తాత్కాలిక సారథి జితేష్ శర్మ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఎస్‌ఆర్‌హెచ్ ఫస్ట్ బ్యాటింగ్‌కు దిగనుంది. రెగ్యులర్ కెప్టెన్ రజత్ పాటిదార్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. దీంతో ఈ మ్యాచ్‌లో జితేష్ సారథిగా వ్యవహరిస్తున్నాడు. ఈ పోరులో ప్లేయింగ్ ఎలెవన్‌లో కొన్ని కీలక మార్పులు చేసింది ఆర్సీబీ. జ్వరం కారణంగా పలు లీగ్ మ్యాచులకు దూరమైన విధ్వంసక ఓపెనర్ ఫిల్ సాల్ట్ తిరిగి జట్టులో చేరాడు. అతడికి ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు కల్పించింది బెంగళూరు. గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోని పాటిదార్ ఇవాళ్టి పోరులో ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఉన్నాడు. ఇంజ్యురీ కారణంగా టీమ్‌కు దూరమైన దేవ్‌దత్ పడిక్కల్ స్థానంలో మయాంక్ అగర్వాల్ తుదిజట్టులోకి వచ్చాడు. మిగిలిన వాళ్లంతా గత మ్యాచ్‌లో ఆడినవాళ్లే.


దంచాల్సిందే..

సన్‌రైజర్స్ కూడా ప్లేయింగ్ ఎలెవన్ విషయంలో పెద్దగా మార్పుచేర్పులు చేయలేదు. దాదాపుగా గత మ్యాచ్‌లో ఆడిన జట్టునే రిపీట్ చేసింది. డాషింగ్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ తిరిగి జట్టులోకి వచ్చాడు. అభిషేక్ శర్మతో కలసి ఈ మ్యాచ్‌లో అతడు ఇన్నింగ్స్‌ను షురూ చేయనున్నాడు. ఇదొక్కటే ఎస్‌ఆర్‌‌హెచ్ చేసిన మార్పు. ఇకపోతే, టాస్ ఓడిపోయినా మొదట బ్యాటింగ్ చేసే అవకాశం రావడం ఆరెంజ్ ఆర్మీకి కలిసొచ్చే అంశమే. బ్యాటింగే ప్రధాన బలంగా బరిలోకి దిగిన సన్‌రైజర్స్.. భారీ టార్గెట్ సెట్ చేస్తే ఆర్సీబీని ఒత్తిడికి లోను చేయడం ఖాయం. మరి.. మన బ్యాటర్లు ఏం చేస్తారో చూడాలి.


ఇవీ చదవండి:

ఆర్సీబీని భయపెడుతున్న ఎస్‌ఆర్‌హెచ్

16 ఏళ్ల కెరీర్‌కు స్టార్ గుడ్‌బై

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 23 , 2025 | 07:18 PM