ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

RCB vs PBKS Prediction: బెంగళూరు వర్సెస్ పంజాబ్.. రాత మార్చే ఫైట్.. ఓడించే దమ్ముందా..

ABN, Publish Date - Apr 18 , 2025 | 06:02 PM

Today IPL Match: ఆర్సీబీ-పంజాబ్ మధ్య భీకర సమరానికి అంతా సిద్ధమైపోయింది. ఢీ అంటే ఢీ అంటున్న ఈ రెండు టీమ్స్‌లో గెలిచిన జట్టు ప్లేఆఫ్స్ బెర్త్ సాధించడం మరింత ఈజీ అవుతుంది. ఈ నేపథ్యంలో ఏ టీమ్‌ గెలిచే అవకాశాలు అధికంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

RCB vs PBKS

థ్రిల్లింగ్ మ్యాచులు, లోస్కోరింగ్ ఫైట్స్‌‌తో ఉత్కంఠ రేపుతున్న ఐపీఎల్‌‌లో హీట్‌ను మరింత పెంచేందుకు రెండు టీమ్స్ రెడీ అవుతున్నాయి. అవే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్. ఈ ఇరు జట్ల మధ్య ఇవాళ చిన్నస్వామి స్టేడియంలో బిగ్ బ్యాటిల్ జరగనుంది. 6 మ్యాచుల్లో 4 విజయాలతో పాయింట్స్ టేబుల్‌లో వరుసగా 3, 4 స్థానాల్లో ఉన్నాయి ఆర్సీబీ, పీబీకేఎస్. ఇవాళ్టి పోరులో నెగ్గిన జట్టు 2వ స్థానానికి ఎగబాకుతుంది. అందుకే అయ్యర్ సేన, కోహ్లీ టీమ్ గెలవాల్సిందేననే పంతంతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇరు జట్ల బలాబలాలు, గత రికార్డుల గురించి తెలుసుకుందాం..


బలాలు

ఆర్సీబీ: ఈ సీజన్‌లో బెంగళూరు బ్యాటర్లు సమష్టిగా రాణిస్తున్నారు. సాల్ట్ దగ్గర నుంచి కోహ్లీ, పడిక్కల్, జితేష్, పటిదార్, డేవిడ్ వరకు అందరూ అదరగొడుతున్నారు. బౌలింగ్‌లో హేజల్‌వుడ్, భువనేశ్వర్, కృనాల్ పాండ్యా రాణిస్తున్నారు. వికెట్లు తీస్తూనే అద్భుతంగా పరుగుల్ని కట్టడి చేస్తున్నారు.

పీబీకేఎస్: ప్రియాన్ష్ ఆర్య, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నిలకడగా పరుగులు చేస్తున్నారు. నేహాల్ వదేరా, శశాంక్ సింగ్ కూడా అవసరం పడిన ప్రతిసారి అదగగొడుతున్నారు. బౌలింగ్‌లో యాన్సన్, చాహల్ వికెట్ల మీద వికెట్లు తీస్తూ టీమ్ విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అర్ష్‌దీప్ సింగ్, మాక్స్‌వెల్ కూడా అవసరాన్ని బట్టి కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ బ్రేక్‌త్రూలు అందిస్తున్నారు.


బలహీనతలు

ఆర్సీబీ: బ్యాటింగ్‌లో సాల్ట్, కోహ్లీ, పటిదార్‌పై ఎక్కువగా డిపెండ్ అవడం మైనస్సే. వీళ్లలో ఏ ఇద్దరు ఫెయిలైనా టీమ్‌కు కష్టాలు తప్పేలా లేవు. లివింగ్‌స్టన్ నుంచి మెరుపు ఇన్నింగ్స్ బాకీ ఉంది. బౌలింగ్‌లో హేజల్‌వుడ్, భువనేశ్వర్‌లో ఒక్కరు ఫెయిలైనా కష్టమే. కాబట్టి ఈ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

పీబీకేఎస్: ఇంగ్లిస్, మాక్స్‌వెల్ బ్యాట్ నుంచి బిగ్ ఇన్నింగ్స్‌లు రాలేదు. ముఖ్యంగా మాక్స్‌వెల్ నుంచి పరుగుల్ని ఆశిస్తోంది పంజాబ్. వధేరా ఫామ్‌ను కొనసాగించాలని కోరుకుంటోంది. బౌలింగ్‌లో బార్ట్‌లెట్ దగ్గర నుంచి వికెట్లు వస్తే పంజాబ్‌కు ఢోకా ఉండదు.

హెడ్ టుహెడ్
ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 33 మ్యాచులు జరిగాయి. అందులో 16 మ్యాచుల్లో ఆర్సీబీ, 17 మ్యాచుల్లో పంజాబ్ విజయం సాధించాయి.

విన్నింగ్ ప్రిడిక్షన్

బలాబలాలు, రికార్డులు ఇలా ఏం చూసుకున్నా రెండు జట్లు పటిష్టంగా ఉన్నాయి. అయితే ఎక్స్‌పీరియెన్స్డ్ బ్యాటింగ్-బౌలింగ్ యూనిట్, హోం గ్రౌండ్ ఆడియెన్స్ సపోర్ట్ మధ్య బరిలోకి దిగుతున్న ఆర్సీబీ ఈ మ్యాచ్‌లో గెలవడం ఖాయం.

Updated Date - Apr 18 , 2025 | 06:16 PM