ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

RCB Victory Parade: 100 కోట్ల పరిహారం.. ఆర్సీబీ తప్పించుకోవడం కష్టమేనా?

ABN, Publish Date - Jun 05 , 2025 | 01:16 PM

ఆర్సీబీ విక్టరీ పరేడ్‌లో చోటు చేసుకున్న విషాదం అందర్నీ తీవ్రంగా కలచివేసింది. 11 మంది ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటనపై క్రీడలతో పాటు ఇతర రంగాలకు చెందిన ప్రముఖులూ స్పందిస్తున్నారు.

RCB

దాదాపు 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఐపీఎల్ కప్పును గెలవాలనే కలను నెరవేర్చుకుంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. ప్రతిష్టాత్మక ఫైనల్ పోరులో పంజాబ్ కింగ్స్‌ను మట్టికరిపించిన పాటిదార్ సేన.. మొదటిసారి క్యాష్ రిచ్ లీగ్ చాంపియన్‌గా నిలిచింది. దీంతో ఆ జట్టు ఆటగాళ్లు, అభిమానులు సంబురాల్లో మునిగిపోయారు. అయితే ట్రోఫీని కైవసం చేసుకున్నా ఆ సంతోషాన్ని పూర్తిగా ఆస్వాదించలేకపోతోంది ఆర్సీబీ. బుధవారం నిర్వహించిన విక్టరీ పరేడ్ సమయంలో చిన్నస్వామి స్టేడియం బయట జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి చెందడం, 50కి పైగా మంది గాయాలపాలవడంతో దేశవ్యాప్తంగా విషాదం నెలకొంది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ రూ.100 కోట్ల పరిహారం చెల్లించాల్సిందేనంటూ ఓ టీమిండియా వరల్డ్ కప్ హీరో డిమాండ్ చేశాడు.


వాళ్లదే బాధ్యత..

‘ఈ విషాద ఘటనను ఎవరూ అంత సులువుగా మర్చిపోరు. విరాట్ కోహ్లీ కూడా దీన్ని మర్చిపోడు. ఒకవైపు బయట ప్రజలు చనిపోతుంటే మరోవైపు స్టేడియం లోపల సంబురాలు చేసుకున్నారు. ఇది హృదయ విదారకరం. ఈ విషాద ఘటనకు ఆర్సీబీ-కర్ణాటక ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఈ మేరకు రూ.100 కోట్ల పరిహారం చెల్లించాలని కోరుతూ ఆ ఫ్రాంచైజీతో పాటు రాష్ట్ర ప్రభుత్వంపై బాధిత కుటుంబాలు దావా వేయాలి. ఈ వివాదం నుంచి భారత క్రికెట్ బోర్డు తప్పించుకోవాలని చూస్తోంది’ అని మదన్‌లాల్ స్పష్టం చేశాడు. కాగా, బెంగళూరు తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఈ నేపథ్యంలో మదన్‌లాల్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని సంతరించుకున్నాయి.


ఇవీ చదవండి:

ప్రశాంతంగా నిద్రపోతా: కోహ్లీ

నా కొడుకు శరీరాన్ని కోయొద్దు

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 05 , 2025 | 01:28 PM