ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Mukesh Kumar: వారసుడొచ్చాడు.. తండ్రైన టీమిండియా క్రికెటర్!

ABN, Publish Date - Jun 27 , 2025 | 08:56 PM

టీమిండియా యువ పేసర్ ఒకరు తండ్రి అయ్యాడు. అతడికి పండంటి మగబిడ్డ పుట్టాడు. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..

Mukesh Kumar

టీమిండియా స్పీడ్‌స్టర్ ముఖేశ్ కుమార్ తండ్రి అయ్యాడు. అతడి ఇంటికి వారసుడు వచ్చాడు. ముఖేశ్-దివ్యా సింగ్ దంపతులకు పండంటి మగబిడ్డ పుట్టాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు భారత్ పేసర్. తమ ఇంట్లోకి వారసుడు వచ్చాడని తెలిపాడు. ఇన్నాళ్లూ తాము ప్రేమ బంధంలో ఉన్నామని, ఇప్పుడు తల్లిదండ్రులుగా కొత్త బంధంలోకి అడుగు పెడుతున్నామని చెప్పుకొచ్చాడు. కొడుకు రాకతో తమ జీవితంలో నూతన అధ్యాయం మొదలైందని ముఖేశ్ కుమార్ పేర్కొన్నాడు.

రీఎంట్రీ కోసం..

ముఖేశ్ కుమార్ తండ్రి అయ్యాడనే విషయం తెలిసి సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కంగ్రాట్స్ ముఖేశ్ అంటూ అభినందనలు తెలియజేస్తున్నారు అభిమానులు. బిడ్డ ఫొటోను షేర్ చేయాలని కొందరు ఫ్యాన్స్ కోరుతున్నారు. కాగా, గత రెండేళ్లుగా టీమిండియా తరఫున ఆడుతూ వస్తున్నాడు ముఖేశ్ కుమార్. మంచి పేస్, కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్‌లో బంతులు వేస్తూ వికెట్లు రాబడుతున్నాడు. జట్టు విజయాల్లో తన వంతు పాత్ర పోషిస్తున్నాడు. తొలుత టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చిన ముఖేశ్.. ఆ తర్వాత వన్డేల్లోనూ అరంగేట్రం చేశాడు. చివరగా ఇంగ్లండ్‌తో గతేడాది జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఆడిన పేసర్.. జట్టులోకి రీఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నాడు. ఐపీఎల్ ద్వారా అతడు మంచి గుర్తింపు సంపాదించాడు. ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున బరిలోకి దిగి 12 మ్యాచుల్లో 12 వికెట్లు పడగొట్టాడు. దేశవాళ్లీ అదరగొడితే అతడు టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు మరింత పెరుగుతాయి.

ఇవీ చదవండి:

బుమ్రా లేకుండానే బరిలోకి..

లక్నో స్టార్‌పై సంచలన ఆరోపణలు

టీమిండియా తిరుగులేని స్కెచ్

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 27 , 2025 | 08:56 PM