Jasprit Bumrah: చరిత్ర సృష్టించిన బుమ్రా.. ఇది నెవర్ బిఫోర్ ఫీట్!
ABN, Publish Date - Jun 22 , 2025 | 09:06 PM
భారత పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా చరిత్ర సృష్టించాడు. నెవర్ బిఫోర్ ఫీట్‌ను అతడు అందుకున్నాడు. ఏ ఆసియా బౌలర్ వల్ల కూడా కానిది.. బూమ్ బూమ్ చేసి చూపించాడు.
టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా చరిత్ర సృష్టించాడు. లీడ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో అతడు చెలరేగాడు. 5 వికెట్లతో ఆతిథ్య జట్టు నడ్డి విరిచాడు. జాక్ క్రేలే, జో రూట్, బెన్ డకెట్‌తో పాటు క్రిస్ వోక్స్, జోష్ టంగ్‌ను వెనక్కి పంపించాడు బుమ్రా. టంగ్‌ను ఔట్ చేసి ఫైవ్ వికెట్ హాల్‌ను పూర్తి చేసుకున్నాడు. తద్వారా విదేశీ గడ్డపై టెస్టుల్లో అత్యధిక సార్లు 5 వికెట్లు పడగొట్టిన రెండో భారత బౌలర్‌గా అతడు క్రేజీ రికార్డు నెలకొల్పాడు. దీంతో పాటు సేనా దేశాల్లో అత్యధిక వికెట్లు తీసిన ఆసియా బౌలర్‌గా ఆల్‌టైమ్ రికార్డ్ క్రియేట్ చేశాడు బుమ్రా.
వాటే బౌలర్..
జోష్ టంగ్ వికెట్‌తో సేనా (సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో 150 వికెట్లు పూర్తి చేసుకున్నాడు బుమ్రా. తద్వారా ఈ మార్క్‌ను అందుకున్న తొలి ఆసియా బౌలర్‌గా అతడు చరిత్ర సృష్టించాడు. మొత్తానికి ఒక్క స్పెల్‌తో పలు రికార్డులకు పాతర వేశాడు భారత స్పీడ్‌స్టర్. దీంతో అందరూ అతడ్ని అభినందిస్తున్నారు. వాటే బౌలర్.. ఇలాంటోడు జట్టులో ఉండటం టీమిండియా చేసుకున్న అదృష్టం అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. కాగా, లీడ్స్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 465 పరుగులకు ఆలౌట్ అయింది ఇంగ్లండ్. బుమ్రాతో పాటు పేసర్లు ప్రసిద్ధ్ కృష్ణ (3/128), మహ్మద్ సిరాజ్ (2/122) రాణించారు. భారీగా పరుగులు ఇచ్చుకున్నా వికెట్లు తీయడంలో సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేసిన భారత్.. ప్రస్తుతం వికెట్ నష్టానికి 20 పరుగులతో ఉంది. కనీసం 300 పరుగుల టార్గెట్ సెట్ చేయాలి లేకపోతే ఆతిథ్య జట్టును టీమిండియా ఆపడం కష్టంగానే కనిపిస్తోంది.
ఇవీ చదవండి:
స్టోక్స్‌కు దిమ్మతిరిగేలా చేసిన సిరాజ్
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 22 , 2025 | 09:09 PM