ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

RCB IPL 2025 Playoffs: ఆర్సీబీని భయపెడుతున్న ప్లేఆఫ్స్ రికార్డు.. అంత ఈజీ కాదు!

ABN, Publish Date - May 28 , 2025 | 08:56 PM

ఆర్సీబీని రికార్డుల భయం పట్టుకుంది. ప్లేఆఫ్స్ పేరు చెబితే కోహ్లీ జట్టు వణుకుతోంది. ఈ నేపథ్యంలో అసలు బెంగళూరు ప్లేఆఫ్స్ గండం దాటుతుందా.. లేదా.. అనేది ఇప్పుడు చూద్దాం..

RCB

ఈ సాలా కప్ నమ్దే (ఈసారి కప్ మాదే).. ప్రతి ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ సమయంలో బాగా వినిపించే డైలాగ్. సీజన్ ముగింపు వరకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులంతా ఈ డైలాగ్‌ జపిస్తుంటారు. ఆ జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కూడా ఈ సాలా కప్ నమ్దే అనే స్లోగన్స్ ఇస్తుంటారు. కానీ ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా ఐపీఎల్ ట్రోఫీని ఒడిసిపట్టలేకపోయింది ఆర్సీబీ. 2009, 2011, 2016లో ఫైనల్స్ చేరినా.. చాంపియన్‌గా నిలవలేకపోయింది. ఇంకో 7 సార్లు ప్లేఆఫ్స్ దశకు చేరుకున్నా.. ఫైనల్స్‌కు క్వాలిఫై కాలేదు. ఇప్పుడు మరోమారు ప్లేఆఫ్స్‌కు చేరుకుంది బెంగళూరు. క్వాలిఫయర్-1కు అర్హత సాధించిన కోహ్లీ జట్టు.. పంజాబ్ కింగ్స్‌తో తాడోపేడో తేల్చుకోనుంది. అయితే ఆ టీమ్‌ను రికార్డులు భయపెడుతున్నాయి. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..


కథ ముగించాలి..

క్యాష్ రిచ్ లీగ్ తొలి ఐదు సీజన్లలో మూడుసార్లు ఫైనల్స్ చేరుకుంది బెంగళూరు. మూడేళ్ల గ్యాప్‌లో రెండుసార్లు ట్రోఫీని చేజార్చుకుంది. 2009 ఫైనల్‌లో డెక్కన్ చార్జర్స్ చేతుల్లో ఓడిన ఆర్సీబీ.. 2011లో చెన్నై సూపర్ కింగ్స్, 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మీద ఓడి కప్పును మిస్ చేసుకుంది. ఆ తర్వాత ప్లేఆఫ్స్ వరకు వస్తున్నా ఫైనల్స్‌కు వెళ్లలేకపోయింది. గతేడాది ఎలిమినేటర్‌కే పరిమితమైంది. రాజస్థాన్ రాయల్స్ చేతుల్లో ఓడి ఇంటిదారి పట్టింది కోహ్లీ టీమ్. అయితే గత నాలుగు సీజన్లుగా వరుసగా ప్లేఆఫ్స్‌కు చేరుతూ వస్తున్న ఆర్సీబీ.. ఈసారి కూడా అద్భుతంగా ఆడుతూ క్వాలిఫయర్-1కు అర్హత సాధించింది. పంజాబ్‌ మీద నెగ్గితే ఫైనల్స్‌కు చేరుకుంటుంది. ఒకవేళ ఓడితే క్వాలిఫయర్-2లో ముంబై ఇండియన్స్-గుజరాత్ టైటాన్స్‌లో ఒకరితో పోటీపడాల్సి ఉంటుంది. ఈ రూపంలో ఆ జట్టుకు ఫైనల్ చేరుకునేందుకు మరో చాన్స్ కూడా ఉంది. అయితే ఎలిమినేటర్, క్వాలిఫయర్-2 ఆర్సీబీకి పెద్దగా కలసిరాలేదు. అందునా పంజాబ్‌పై ఓడితే ముంబై-జీటీతో తలపడాలి. ఈ రెండూ బలమైన జట్లే. కాబట్టి ఓడితే మరో చాన్స్ ఉన్నా పరిస్థితి అంతవరకు రాకుండా బెంగళూరు జాగ్రత్త పడాలి. పంజాబ్‌ కథ ముగించి ఫైనల్‌కు చేరుకోవడం మీద ఫోకస్ చేయాలి.


ఇవీ చదవండి:

హీరోలను మించిన లుక్‌లో రాహుల్!

కోహ్లీతో మైండ్‌గేమ్స్.. ఎవడ్రా వీడు!

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 28 , 2025 | 08:57 PM