IPL 2025 Playoffs Scenario: సగం సీజన్ కంప్లీట్.. పక్కా ప్లేఆఫ్స్‌కు వెళ్లేది ఎవరంటే..
ABN, Publish Date - Apr 20 , 2025 | 01:22 PM
IPL 2025: ఐపీఎల్ మొదలై అప్పుడే నెల కావొస్తోంది. ఇప్పటికే సగం మ్యాచులు ముగిశాయి. దీంతో ప్లేఆఫ్స్‌కు ఏయే జట్లు వెళ్తాయా అని అభిమానులు డిస్కస్ చేసుకుంటున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ నయా సీజన్ మొదలై దాదాపు నెల కావొస్తోంది. మార్చి 22న లేటెస్ట్ ఎడిషన్ ఫస్ట్ మ్యాచ్ జరిగింది. ఇప్పటికి అన్ని జట్లు సగం మ్యాచులు ఆడేశాయి. లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ 8వ మ్యాచ్ కూడా కంప్లీట్ చేసుకున్నాయి. లీగ్ సెకండాఫ్ స్టార్ట్ కానున్న నేపథ్యంలో ఏయే జట్లు ప్లేఆఫ్స్‌కు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.. ఎవరి చాన్సులు ఎంత.. ప్లేఆఫ్స్ బెర్త్ ఏయే టీమ్స్‌కు కష్టంగా మారొచ్చు.. అనేది ఇప్పుడు చూద్దాం..
వీళ్లకు ఢోకా లేదు
ప్రస్తుతం పాయింట్స్ టేబుల్‌లో గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జియాంట్స్ వరుసగా 1, 2, 3, 4 స్థానాల్లో ఉన్నాయి. అన్ని టీమ్స్ 10 పాయింట్లతో ఉన్నా నెట్ రన్‌రేట్ ఆధారంగా జీటీ టాప్‌లో కొనసాగుతోంది. ఇందులో జీటీ, డీసీ, పంజాబ్ మరో 7 మ్యాచులు ఆడాల్సి ఉంది. ఇందులో కనీసం మూడింట్లో నెగ్గినా సరిపోతుంది. నెట్ రన్‌రేట్ మెరుగ్గా ఉంది కాబట్టి ప్లేఆఫ్స్ బెర్త్ ఖాయం చేసుకోవచ్చు. ఒకవేల నాలుగింట్లో నెగ్గితే టాప్-2తో గ్రూప్ స్టేజ్‌ను ఫినిష్ చేయొచ్చు. ఇక, నాలుగో స్థానంలో ఉన్న లక్నోకు ఇంకో 6 మ్యాచులు మిగిలి ఉన్నాయి. అందులో కనీసం మూడింట్లో నెగ్గితే ఆ టీమ్ సేఫ్ అవుతుంది. ఒకవేళ రెండింట్లో గెలిచినా నెట్ రన్‌రేట్ బాగుంది కాబట్టి ప్లేఆఫ్స్ రేసులోనే ఉంటుంది.
సన్‌రైజర్స్ పరిస్థితేంటి..
పాయింట్స్ టేబుల్‌లో 5వ స్థానంలో ఉన్న ఆర్సీబీ, ఆరో పొజిషన్‌లో ఉన్న కేకేఆర్, ఆ తర్వాతి స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్‌కూ ప్లేఆఫ్స్ అవకాశాలు మెండుగా ఉన్నాయి. తదుపరి ఆడే 7 మ్యాచుల్లో 4 మ్యాచుల్లో కచ్చితంగా నెగ్గాలి బెంగళూరు. అదే కేకేఆర్ అయితే నెక్స్ట్ ఆడే 7 మ్యాచుల్లో 5 మ్యాచుల్లో గెలిచితీరాలి. ముంబై కూడా మరో 5 విజయాలు సాధిస్తే గానీ ప్లేఆఫ్స్ రేసులో ఉండదు. అదే రాజస్థాన్ అయితే నెక్స్ట్ ఆడే ఆరు మ్యాచుల్లోనూ విజయం సాధించాలి. ఇక, పాయింట్స్ టేబుల్‌లో ఆఖరున ఉన్న సన్‌రైజర్స్, సీఎస్‌కే నెక్స్ట్ ఆడే 7 మ్యాచుల్లో 6 మ్యాచుల్లో గెలిస్తే ప్లేఆఫ్స్ చేరుకోవచ్చు. ఒకవేళ ఐదింట్లో నెగ్గినా భారీ తేడాతో గెలిచి, నెట్ రన్‌రేట్‌ను మైనస్ నుంచి ప్లస్‌లోకి తీసుకెళ్లాలి. సేమ్ టైమ్ ఇతర జట్ల గెలుపోటముల మీద ఆధారపడాల్సి ఉంటుంది. ఓవరాల్‌గా చెప్పాలంటే ప్రతి టీమ్‌కు ప్లేఆఫ్స్ చాన్స్ ఉంది. అయితే టాప్-7లో ఉన్న జీటీ, డీసీ, పంజాబ్, ఎల్‌ఎస్‌జీ, ఆర్సీబీ, కేకేఆర్, ముంబైకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. రాజస్థాన్, సన్‌రైజర్స్, సీఎస్‌కే ప్లేఆఫ్స్ వెళ్లాలంటే అద్భుతమే జరగాలి. ఇకపై దాదాపుగా ప్రతి మ్యాచ్‌లో నెగ్గాలి.
ఇవీ చదవండి:
కేకేఆర్ చెంతకు అభిషేక్ నాయర్
మా జట్టు భారత్ వెళ్లదు: పీసీబీ
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Apr 20 , 2025 | 01:29 PM