ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

IND vs PAK Match Prediction: భారత్-పాక్ సమరం.. గెలిచేదెవరు, ఓడేదెవరు.. ప్రిడిక్షన్ ఇదే..

ABN, Publish Date - Feb 22 , 2025 | 02:45 PM

Champions Trophy 2025: చాంపియన్స్ ట్రోఫీలో మోస్ట్ ఎగ్జయిటింగ్‌ మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది. చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్థాన్ మధ్య దుబాయ్ వేదికగా ఆదివారం నాడు బ్లాక్‌బస్టర్ ఫైట్ జరగనుంది.

IND vs PAK Prediction

క్రికెట్ లవర్స్ ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న దాయాదులు భారత్-పాకిస్థాన్ మధ్య ఇంట్రెస్టింగ్‌ ఫైట్‌కు టైమ్ వచ్చేసింది. దుబాయ్ వేదికగా ఈ రెండు టీమ్స్ పోటీపడనున్నాయి. చాంపియన్స్ ట్రోఫీ సెమీస్‌ బెర్త్ కన్ఫర్మ్ చేసుకునేందుకు ఇరు జట్లకు ఈ పోరు కీలకం కానుంది. టీమిండియాకైనా న్యూజిలాండ్ మ్యాచ్ రూపంలో ఇంకో చాన్స్ ఉంది. కానీ పాక్‌కు మాత్రం ఇదే ఆఖరి అవకాశం. ఓడితే ఇంటిదారి పట్టక తప్పదు. ఈ నేపథ్యంలో రేపటి పోరులో గెలిచేదెవరు? ఓడేదెవరు? మొగ్గు ఎవరి వైపు ఎక్కువగా ఉంది? అనేది ఇప్పుడు చూద్దాం..


రికార్డులు ఏం చెబుతున్నాయి?

ఐసీసీ టోర్నీల్లో పాకిస్థాన్‌పై ఎప్పుడూ భారత్‌దే పైచేయి. దాయాది ఎదురుపడితే చాలు టీమిండియా చితకబాదడం రివాజుగా మారింది. కానీ చాంపియన్స్ ట్రోఫీలో మాత్రం మన మీద పాక్‌దే పైచేయి. ఈ టోర్నమెంట్‌లో ఇరు టీమ్స్ 5 సార్లు తలపడ్డాయి. అందులో పాక్ 3 సార్లు నెగ్గగా.. భారత్ 2 మార్లు విజయం సాధించింది.


బలాబలాలు

రికార్డుల పరంగా భారత్ కంటే పాకిస్థాన్ మెరుగ్గా ఉంది. కానీ ప్రస్తుత ఫామ్, టీమ్ కాంబినేషన్, కాన్ఫిడెన్స్, కెప్టెన్సీ, విన్నింగ్ స్ట్రీక్.. ఇలా మిగతా విషయాలు చూసుకుంటే మాత్రం టీమిండియాదే పైచేయి. రోహిత్, విరాట్, హార్దిక్, రాహుల్, అయ్యర్, షమి లాంటి సీనియర్లతో పాటు గిల్, అర్ష్‌దీప్, అక్షర్, హర్షిత్ వంటి యువకులతో నిండిన టీమిండియా జోరును తట్టుకోవడం పాక్‌కు కష్టమే. పేస్, స్పిన్, బ్యాటింగ్.. ఇలా ఏ విధంగా చూసినా మన జట్టు బలిష్టంగా ఉంది.

పాకిస్థాన్‌కు పేసే ప్రధాన బలం. షాహిన్ అఫ్రిదీ, హ్యారిస్ రౌఫ్, నసీం షాతో కూడిన బౌలింగ్ అటాక్ చెలరేగితే ఎంతటి బ్యాటింగ్ లైనప్‌నైనా కూల్చేయగలదు. కానీ వీళ్లు పెద్దగా ఫామ్‌లో లేరు. పైగా వీళ్లపై ఈ మధ్య కాలంలో ఆడిన ప్రతిసారి టీమిండియా బ్యాటర్లు ధారాళంగా పరుగులు రాబట్టారు. పాక్ జట్టులో క్వాలిటీ స్పిన్నర్ లేకపోవడం మరో బలహీనత. బ్యాటింగ్‌లో రిజ్వాన్, అలీ అఘా వంటి ఒకరిద్దరు తప్పితే ఎవరూ నిలకడగా రాణించడం లేదు. బాబర్ పరుగులు చేయడానికి ఆపసోపాలు పడుతున్నాడు. ఇన్ని బలహీనతలు ఉన్న టీమ్.. ఒక్కసారిగా భారత్‌పై పుంజుకొని ఆడుతుందని ఊహించడం కష్టమే.


ఒత్తిడి

భారత్-పాక్ మ్యాచ్‌లో బలాబలాలు, రికార్డుల కంటే ప్రెజర్‌ను ఏ టీమ్ బాగా హ్యాండిల్ చేస్తుందో వాళ్లకు గెలిచే అవకాశాలు మెండుగా ఉంటాయని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. ఇరు టీమ్స్ ఎప్పుడు తలపడినా ఎమోషన్స్‌‌ది కీలక పాత్ర. ఎవరైతే భావోద్వేగాలు, ఒత్తిడిని నియంత్రించుకొని ఆడతారో వాళ్లు విజయం సాధించే చాన్స్ ఎక్కువ అని అంటున్నారు. ఈ మధ్య కాలంలో ఎన్నో మ్యాచుల్లో క్రంచ్ సిచ్యువేషన్స్‌లో ధైర్యంగా నిలబడి విక్టరీలు కొట్టినందున ఆ విషయంలోనూ రోహిత్ సేనకు పాక్‌పై గట్టి ఎడ్జ్ ఉందని చెప్పొచ్చు.

ప్రిడిక్షన్

రికార్డులు, బలాబలాలు, ఒత్తిడి, ఎమోషన్స్, స్క్వాడ్స్, ప్రస్తుత ఫామ్.. ఇలా అన్నింటినీ బేరీజు వేసుకొని చూస్తే మరోసారి పాక్‌ను భారత్ చిత్తు చేయడం ఖాయం. దాయాదిని ఇంటికే పరిమితం చేయడం పక్కా.


ఇవీ చదవండి:

పాక్‌పై అతడి తాండవం.. యువీ జోస్యం అదిరింది

పగతో రగిలిపోతున్న రోహిత్

ఇండో-పాక్ మ్యాచ్.. ఐఐటీ బాబా ప్రిడిక్షన్ వైరల్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 22 , 2025 | 07:35 PM