ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Gill-Gambhir: గిల్ సేనను రెచ్చగొడుతున్న ఇంగ్లండ్.. కోహ్లీ లేడనే ధైర్యంతో..!

ABN, Publish Date - Jun 11 , 2025 | 01:21 PM

ఐదు టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లండ్‌కు వెళ్లిన భారత జట్టుపై అప్పుడే అటాకింగ్ మొదలైంది. గిల్ సేనను రెచ్చగొడుతోంది ఇంగ్లండ్. కోహ్లీ లేడనే ధైర్యంతో ఇంగ్లీష్ ప్లేయర్లు, సీనియర్లు రెచ్చిపోతున్నారు.

Virat Kohli

టీమిండియాతో మ్యాచ్ అంటే చాలు.. బడా బడా జట్లు కూడా భయపడతాయి. దీనికి మెన్ ఇన్ బ్లూ అన్ని విభాగాల్లో బలంగా ఉండటం ఒక కారణమైతే.. మాటలతో ప్రత్యర్థుల బెండు తీసే విరాట్ కోహ్లీ టీమ్‌లో ఉండటం మరో కారణమని చెప్పాలి. అపోజిషన్ టీమ్స్ రెచ్చిగొట్టినా ఒకప్పుడు భారత ఆటగాళ్లు చూసీ చూడనట్లు ఉండేవారు. బ్యాట్, బంతితోనే వాళ్లకు సమాధానం ఇచ్చేవారు. కానీ కోహ్లీ మాత్రం మాటకు మాట అన్నట్లు దూకుడుగా వ్యవహరిస్తూ ప్రతర్థుల వెన్నులో వణుకు పుట్టించేవాడు. దీంతో మన జట్టుతో పెట్టుకోవాలంటే అంతా భయపడేవారు. కానీ పరిస్థితులు వేగంగా మారిపోయాయి. టెస్టుల నుంచి కోహ్లీ తప్పుకోవడంతో భారత జట్టును లక్ష్యంగా చేసుకొని రెచ్చిపోతున్నారు ప్రత్యర్థులు.

రెచ్చగొడుతున్నారు..

ఇంగ్లండ్ స్టార్ ఓలీ పాప్ తాజాగా మన టీమ్‌ను లక్ష్యంగా చేసుకొని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా బలంగా ఉందని.. కానీ విరాట్ కోహ్లీని మిస్ అవుతున్నామని అన్నాడు. స్లిప్స్‌లో నిల్చొని కోహ్లీ చేసే ఇకఇకలు, పకపకలు ఇకపై చూడలేమంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు పాప్. ‘భారత జట్టు నిండా కుర్రాళ్లే ఉన్నారు. కానీ వాళ్లు చాలా ప్రతిభావంతులు. టీమిండియా నూతన సారథి శుబ్‌మన్ గిల్ అద్భుతమైన ఆటగాడు. అయితే కోహ్లీ లేని లోటు కనిపిస్తోంది. విరాట్ లేకపోయినా ఆ టీమ్‌లో టాలెంట్‌కు కొదువలేదు. ఈ సవాల్‌కు మేం సిద్ధంగా ఉన్నాం’ అని పాప్ స్పష్టం చేశాడు.

ఇకఇకలు-పకపకలు..

ఒకవైపు భారత జట్టు బలంగా ఉందని అంటూనే.. మరోవైపు కోహ్లీ ఇకఇకలు, పకపకలు మిస్ అవుతామంటూ సెటైర్ వేశాడు పోప్. దీంతో అతడి వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్స్ సీరియస్ అవుతున్నారు. విరాట్ లేడనే ధైర్యంతోనే ఇంగ్లండ్ ఓవరాక్షన్ చేస్తోందని.. గిల్ సేన వాళ్లకు చుక్కలు చూపించడం ఖాయమని అంటున్నారు. జైస్వాల్, బుమ్రా లాంటి వాళ్లు ఆటతీరుతోనే కాదు నోటితోనూ ప్రత్యర్థులకు ఇచ్చిపడేస్తారని చెబుతున్నారు. కాగా, భారత్-ఇంగ్లండ్ మధ్య 5 టెస్టుల సిరీస్ జూన్ 20 నుంచి మొదలవనుంది. ఈ నేపథ్యంలోనే టీమిండియాను లక్ష్యంగా చేసుకొని ఇంగ్లండ్ ప్లేయర్లు, సీనియర్లు నోటికి పని చెబుతున్నారు.

ఇవీ చదవండి:

ఆ పని చేస్తే తిరుగుండదు

ఆర్సీబీ ఆక్షన్ వీడియో లీక్!

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 11 , 2025 | 04:30 PM