ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Akash Deep No Ball: ఆకాశ్‌దీప్ నో బాల్ వివాదంపై ఎంసీసీ క్లారిటీ.. ఏం చెప్పిందంటే?

ABN, Publish Date - Jul 08 , 2025 | 12:03 PM

భారత పేసర్ ఆకాశ్‌దీప్ వేసిన నో బాల్‌పై వివాదం చెలరేగుతోంది. తాజాగా దీనిపై ఎంసీసీ క్లారిటీ ఇచ్చింది. అది సరైన బంతేనంటూ సాక్ష్యాలతో సహా తేల్చేసింది.

Akash Deep

ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో టీమిండియా ఘనవిజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు పేసర్ ఆకాశ్‌దీప్. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 10 వికెట్లు పడగొట్టాడీ స్పీడ్‌స్టర్. కట్టుదిట్టమైన లైన్ అండ్ లెంగ్త్, క్వాలిటీ పేస్‌తో బంతి సీమ్‌ను వాడుకుంటూ ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. జస్‌ప్రీత్ బుమ్రా స్థానంలో జట్టులోకి వచ్చిన ఆకాశ్‌దీప్.. పేసుగుర్రం చేసే పనినే సమర్థంగా చేసి చూపించాడు. ఒక్క మ్యాచ్‌తో ఓవర్‌నైట్ స్టార్‌గా అవతరించాడు. అయితే అంతా బాగానే ఉన్నా రెండో ఇన్నింగ్స్‌లో అతడు జో రూట్‌ను ఔట్ చేసిన డెలివరీ మీద వివాదం చెలరేగుతోంది. అది నో బాల్ అంటూ నానా రభస చేస్తున్నారు ఇంగ్లండ్ అభిమానులు. ఈ నేపథ్యంలో దీనిపై క్రికెట్ నిబంధనలు తయారు చేసే మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) తాజాగా క్లారిటీ ఇచ్చింది. ఇంతకీ ఎంసీసీ ఏం చెప్పిందంటే..

నో టెన్షన్..

‘భారత్-ఇంగ్లండ్ టెస్ట్‌లో నాలుగో రోజు ఆటలో జో రూట్‌ను ఆకాశ్‌దీప్ ఔట్ చేసిన బంతి గురించి భారీగా చర్చలు జరగడం మా దృష్టికి వచ్చింది. అది నో బాల్ అంటూ చాలా మంది అభిమానులు, కామెంటేటర్లు చెప్పడం మేం గమనించాం. అయితే అది నో బాల్ కాదు. అది కరెక్ట్ డెలివరీనే. ఆకాశ్‌దీప్ క్రీజుకు దూరంగా బౌలింగ్ చేశాడు. బంతి వేసే సమయంలో అతడి కుడి కాలు లోపలే ల్యాండ్ అయింది. కాలి మడమ మొదట క్రీజును తాకింది. థర్డ్ అంపైర్ నో బాల్ ఇవ్వలేదు. నిబంధనల ప్రకారం ఇది సరైన నిర్ణయమే. ఈ విషయంలో మేం పూర్తిగా సంతృప్తిగా ఉన్నాం’ అని ఎంసీసీ అధికారి క్లారిటీ ఇచ్చారు.

లీగల్ డెలివరీనే..

ఆకాశ్‌దీప్ బ్యాక్ ఫుట్ క్రీజులో సరిగ్గా ల్యాండ్ అయిందని.. రిటర్న్ క్రీజును టచ్ అవ్వలేదని ఎంసీసీ అధికారి స్పష్టం చేశారు. గ్రౌండ్‌లో మొదట బ్యాక్ ఫుట్ గనుక కాంటాక్ట్ అయితే టెన్షన్ అక్కర్లేదని.. ఆకాశ్‌దీప్ విషయంలో అదే జరిగిందని తెలిపారు. అతడి కాలు తొలుత గ్రౌండ్‌కు తాకిందని, రిటర్న్ క్రీజును టచ్ అవ్వలేదన్నారు. బంతిని వేసే సమయంలో అతడు క్రీజు లోపలే ఉన్నాడు కాబట్టి రూల్ ప్రకారం అది లీగల్ డెలివరీ అని ఎంసీసీ తేల్చేసింది. ఇకనైనా ఈ వివాదానికి చెక్ పడుతుందేమో చూడాలి.

ఇవీ చదవండి:

అందుకే 400 వద్దనుకున్నా..

రాక్షసుడ్ని దింపుతున్నారు

కోహ్లీ ఫ్రెండ్‌పై ఎఫ్‌ఐఆర్!

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 08 , 2025 | 12:14 PM