ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Glenn Maxwell Retirement: ఆసీస్ రాక్షసుడి రిటైర్‌మెంట్.. ఇలా షాక్ ఇచ్చాడేంటి!

ABN, Publish Date - Jun 02 , 2025 | 02:06 PM

ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 13 ఏళ్ల కెరీర్‌కు అతడు గుడ్‌బై చెప్పేశాడు. ఓ పాడ్‌కాస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు తన నిర్ణయాన్ని వెల్లడించాడు.

Glenn Maxwell

ఆస్ట్రేలియా పించ్‌హిట్టర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వన్డే క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు అతడు వెల్లడించాడు. ఫైనల్ వర్డ్ అనే పాక్ట్‌కాస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు తన నిర్ణయాన్ని తెలిపాడు. వన్డే ప్రపంచ కప్-2027ని దృష్టిలో పెట్టుకొని ఈ డెసిషన్ తీసుకున్నానని.. యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడం కోసం తాను వైదొలుగుతున్నట్లు మ్యాక్సీ పేర్కొన్నాడు. క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ సెలెక్టర్ జార్జ్ బెయిలీతో చర్చించిన తర్వాతే 50 ఓవర్ల ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పినట్లు 36 ఏళ్ల మ్యాక్స్‌వెల్ తెలిపాడు. అతడి రిటైర్‌మెంట్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా కూడా ‌ధ్రువీకరించింది.


మర్చిపోలేని ఇన్నింగ్స్..

గ్లెన్ మాక్స్‌వెల్ 2012లో ఆస్ట్రేలియా జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. 13 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో మ్యాచుల్లో ఒంటిచేత్తో కంగారూలకు అద్భుత విజయాలు అందించాడు. ముఖ్యంగా వన్డే వరల్డ్ కప్-2023లో ఆఫ్ఘానిస్థాన్‌ మీద అతడు ఆడిన ఇన్నింగ్స్ అయితే క్రికెట్ లవర్స్‌కు ఎప్పటికీ గుర్తుండిపోతుందని చెప్పొచ్చు. ఆ మ్యాచ్‌లో గాయంతో బాధపడుతూనే ఒంటికాలు మీద నిలబడి సిక్సుల వర్షం కురిపించాడు మ్యాక్సీ. అతడి కెరీర్‌లో ఇది హైలైట్ ఇన్నింగ్స్ అనే చెప్పాలి. మొత్తంగా 149 వన్డేల్లో 3990 పరుగులు చేశాడీ స్టార్ ‌ఆల్‌రౌండర్. ఇందులో 4 సెంచరీలు, 23 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఆఫ్ స్పిన్నర్ అయిన మ్యాక్సీ.. 77 వికెట్లు కూడా తీశాడు. 2015, 2019 వన్డే ప్రపంచ కప్‌లను ఆసీస్ గెలుచుకోవడంలో అతడు కీలకపాత్ర పోషించాడు. ఆఖరుగా చాంపియన్స్ ట్రోఫీలో ఆసీస్ తరఫున ఆడిన మ్యాక్సీ.. ఇక మీదట టీ20ల్లో మాత్రమే కొనసాగనున్నాడు.


ఇవీ చదవండి:

చాహల్ గర్ల్‌ఫ్రెండ్ సెలబ్రేషన్స్ వైరల్

హార్దిక్-అయ్యర్ జీతాలు కట్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 02 , 2025 | 02:17 PM