ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Dubai Pitch Report: దుబాయ్ పిచ్ రిపోర్ట్.. బౌలింగా.. చేజింగా.. ఏది బెస్ట్

ABN, Publish Date - Mar 04 , 2025 | 01:09 PM

IND vs AUS: భారత్-ఆస్ట్రేలియా మధ్య బిగ్ ఫైట్‌కు సర్వం సిద్ధమైంది. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఈ రెండు జట్ల మధ్య ఇవాళ నాకౌట్ మ్యాచ్ జరగనుంది. దీనికి దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం ఆతిథ్యం ఇస్తోంది.

Dubai Pitch

చాంపియన్స్ ట్రోఫీ-2025లో అసలు సిసలు పోరాటానికి అంతా సిద్ధమైంది. కొదమసింహాలు భారత్-ఆస్ట్రేలియా మధ్య కీలక పోరుకు మరికొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. ఇరు జట్లు బరిలోకి దిగి తాడోపేడో తేల్చుకునేందుకు రెడీ అవుతున్నాయి. గెలిచిన టీమ్ ఫైనల్స్‌కు, ఓడిన జట్టు ఇంటికి చేరుతుంది. అందుకే అటు స్మిత్ సేనకు, ఇటు రోహిత్ సేనకు ఈ మ్యాచ్ చావోరేవోగా మారింది. ఇరు జట్లు పేపర్ మీద బలంగా కనిపిస్తున్నాయి. అయితే స్టార్లతో నిండిన మెన్ ఇన్ బ్లూ ఫామ్, వరుస విజయాలతో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. కీలక ఆటగాళ్లు లేకపోవడంతో కంగారూలు అండర్‌డాగ్స్‌గా వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తున్న దుబాయ్‌లో పిచ్, కండీషన్స్ ఎలా ఉన్నాయి? టాస్ గెలిస్తే బౌలింగ్-బ్యాటింగ్‌లో ఏది తీసుకుంటే బెటర్? అనేది ఇప్పుడు చూద్దాం..


ఎవరికి అనుకూలం..

దుబాయ్ పిచ్ మొదట్నుంచి స్పిన్ ఫ్రెండ్లీగానే ఉంది. వన్డేల్లో ఎక్కువగా స్పిన్నర్లకే మద్దతు లభిస్తూ ఉంటుంది. పేసర్లకు శ్రమిస్తే వికెట్లు దక్కుతాయి. చాంపియన్స్ ట్రోఫీ-2025లోని గత మూడు మ్యాచుల్లోనూ ఎక్కువగా స్పిన్నర్లే ప్రభావం చూపారు. గత మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తి 5 వికెట్లతో రచ్చ రచ్చ చేశాడు.

బ్యాటింగ్ పరిస్థితేంటి..

ఇక్కడ పరుగులు చేయడం అంత ఈజీ కాదు. ఒక్కో రన్ కోసం బ్యాటర్లు శ్రమించడం గత మ్యాచుల్లో చూశాం. బాల్ పిచ్ మీద పడ్డాక బ్యాట్ పైకి నెమ్మదిగా వస్తోంది. కాబట్టి బిగ్ షాట్స్ కొట్టడం కష్టమవుతోంది. వికెట్ కాపాడుకోవడం, స్ట్రైక్ రొటేషన్‌కు ప్రాధాన్యత ఇచ్చి హార్దిక్ పాండ్యా కివీస్‌పై చేసినట్లు ఆఖర్లో దంచుడు షురూ చేస్తే బెనిఫిట్ అని ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.


టాస్

టాస్ గెలిచిన జట్టు చేజింగ్‌కు మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువ. ఎందకంటే ఇక్కడ ఫస్ట్ బౌలింగ్ చేసిన జట్టు ఎక్కువ సార్లు గెలిచాయి. ఇప్పటివరకు దుబాయ్‌లో 59 వన్డేల్లో 23 సార్లు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ నెగ్గగా.. 36 సార్లు చేజింగ్ టీమ్స్ గెలిచాయి. అందుకే టాస్ నెగ్గితే బౌలింగ్ తీసుకునేందుకు మొగ్గు చూపొచ్చు. ఈ టోర్నమెంట్‌లో భారత్ ఆడిన మూడు మ్యాచుల్లో గెలిచింది. అందులో రెండు సార్లు చేజ్ చేసి విక్టరీ కొట్టింది.

ఎంత స్కోరు సేఫ్..

దుబాయ్ పిచ్‌లో హయ్యెస్ట్ స్కోరు 285. అది కూడా భారత్‌దే. తొలి ఇన్నింగ్స్‌లో మన టీమ్ చేసిన స్కోరు అది. ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోరు 219. సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోరు 193. తొలుత బ్యాటింగ్ చేస్తే 250 పైచిలుకు స్కోరు సేఫ్ అని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. ఒకవేళ చేజింగ్ చేయాల్సి వస్తే ప్రత్యర్థిని 220 లోపు కట్టడి చేయాలని అంటున్నారు.


ఇవీ చదవండి:

ఈ ఆరుగురి ఆట అస్సలు మిస్సవ్వొద్దు

ఆకలితో ఉన్న సింహాన్ని రెచ్చగొడుతున్నారు

‘లారెస్‌’ అవార్డుకు పంత్‌ నామినేట్‌

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 04 , 2025 | 01:10 PM