Share News

‘లారెస్‌’ అవార్డుకు పంత్‌ నామినేట్‌

ABN , Publish Date - Mar 04 , 2025 | 02:47 AM

ప్రతిష్ఠాత్మక లారెస్‌ వరల్డ్‌ స్పోర్ట్స్‌ అవార్డుకు భారత వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ నామినేట్‌ అయ్యాడు. 2025కు గాను ‘కమ్‌బ్యాక్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డు కేటగిరీలో...

‘లారెస్‌’ అవార్డుకు పంత్‌ నామినేట్‌

న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక లారెస్‌ వరల్డ్‌ స్పోర్ట్స్‌ అవార్డుకు భారత వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ నామినేట్‌ అయ్యాడు. 2025కు గాను ‘కమ్‌బ్యాక్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డు కేటగిరీలో పంత్‌ను ఎంపిక చేశారు. మాడ్రిడ్‌లో వచ్చే నెల 21న ఈ అవార్డుల ప్రదాన కార్యక్రమం జరగనుంది. 2022, డిసెంబరు 30న జరిగిన కారు ప్రమాదంలో పంత్‌ తీవ్రంగా గాయపడ్డాడు. శస్త్రచికిత్స అనంతరం ఎన్‌సీఏలో క్రమంగా కోలుకొన్న రిషభ్‌ గతేడాది ఐపీఎల్‌తో మళ్లీ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు.


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 04 , 2025 | 02:47 AM