ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

DC vs RCB: రాక్షసుడు వచ్చేస్తున్నాడు.. ఆర్సీబీకి ఇక చుక్కలే..

ABN, Publish Date - Apr 27 , 2025 | 06:22 PM

Today IPL Match: ఆర్సీబీని చిత్తు చేసేందుకు రాక్షసుడ్ని దింపుతోంది డీసీ. అతడు గానీ రెచ్చిపోయాడా వార్ వన్ సైడే. ఇంకో ఆప్షనే లేదు.. ప్రత్యర్థి తోక ముడవాల్సిందే. మరి.. ఎవరా పించ్ హిట్టర్ అనేది ఇప్పుడు చూద్దాం..

DC vs RCB

రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ఫైట్‌కు రెడీ అయిపోయింది ఢిల్లీ క్యాపిటల్స్. ఈ ఇరు జట్ల మధ్య ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఇవాళ కీలక పోరు జరగనుంది. ఈ మ్యాచ్‌లో నెగ్గితే దాదాపుగా ప్లేఆఫ్స్ బెర్త్ ఖాయమైనట్లే. అందుకే విజయం కోసం ఇరు జట్లు నువ్వానేనా అంటూ ఢీకొనడం పక్కా. రీసెంట్‌గా బెంగళూరులో కోహ్లీ టీమ్‌ను ఓ పట్టు పట్టిన అక్షర్ సేన.. మరోమారు వాళ్లను చిత్తు చేయాలని చూస్తోంది. అందుకోసం ఏకంగా ఓ బ్యాటింగ్ రాక్షసుడ్ని దింపుతోంది. మరి.. ఎవరా రాక్షసుడు.. అతడి రాకతో ఏం మారబోతోంది అనేది ఇప్పుడు చూద్దాం..


విధ్వంసమే..

ఢిల్లీ క్యాపిటల్స్ వైస్ కెప్టెన్, ఓపెనర్ ఫాఫ్ డుప్లెసిస్ ఇంజ్యురీ నుంచి రికవర్ అయ్యాడు. గాయం కారణంగా పలు మ్యాచులకు దూరమైన ఈ పించ్ హిట్టర్.. ఇవాళ ఆర్సీబీతో జరిగే పోరుకు అందుబాటులో ఉండనున్నాడు. అతడి రీఎంట్రీతో డీసీ బ్యాటింగ్ యూనిట్ మరింత స్ట్రాంగ్ కానుంది. ఇప్పటికే కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, అశుతోష్ శర్మ, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్‌తో దుర్భేద్యంగా ఉన్న ఢిల్లీ.. డుప్లెసిస్ రాకతో ఇంకా బలోపేతం కానుంది. లాస్ట్ సీజన్ ఆర్సీబీకి కెప్టెన్‌గా వ్యవహరించిన డుప్లెసిస్.. ఇవాళ అదే టీమ్‌ మీద రీఎంట్రీ ఇచ్చే చాన్సులు గట్టిగా కనిపిస్తున్నాయి. రిస్క్ వద్దనుకుంటే తప్ప డుప్లెసిస్‌ను డీసీ బరిలోకి దింపడం ఖాయం. అదే జరిగితే తనకు ఎంతో ఇష్టమైన బెంగళూరుపై డుప్లెసిస్ ఎలా ఆడతాడనేది చూడాలి. రెండు, మూడు ఓవర్లు కుదురుకున్నాడా ప్రత్యర్థి బౌలర్లపై రాక్షసుడిలా విరుచుకుపడటం డుప్లెసిస్ స్టైల్. మరి.. ఈ బ్యాటింగ్ పిచ్చోడ్ని బెంగళూరు ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.


ఇవీ చదవండి:

ఈ పగ ఎప్పటికీ చల్లారదు

పంత్ సేనకు చేజింగ్ కష్టమే..

టాస్ నెగ్గిన లక్నో.. కానీ కష్టమే..

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 27 , 2025 | 06:22 PM