ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Team India: ఇండియా జట్టుకు కొత్త కోచ్.. అసలు కారణమిదే..

ABN, Publish Date - Jun 08 , 2025 | 06:29 PM

టీమిండియా (Team India) క్రికెట్ జట్టు నుంచి కీలక అప్‎డేట్ వచ్చేసింది. ఫిట్‌నెస్ రంగంలో అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన సౌతాఫ్రికా నిపుణుడు ఆడ్రియన్ లె రూక్స్ Adrian le Roux) మళ్లీ టీమ్ ఇండియా స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్‌గా వచ్చాడు.

Adrian le Roux Team India coach

భారత క్రికెట్ (Team India) జట్టులో కీలక మార్పు చోటు చేసుకుంది. సౌతాఫ్రికా స్పోర్ట్స్ నిపుణుడు ఆడ్రియన్ లె రూక్స్ (Adrian le Roux) మళ్లీ భారత జట్టు కోచ్‎గా వచ్చాడు. ఆయన 2002 నుంచి 2003 వరకు కూడా భారత జట్టుకు స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్‌గా సేవలందించాడు. ఇప్పుడు మరోసారి అదే బాధ్యతలు చేపట్టాడు. ఇప్పటివరకు భారత జట్టుకు స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్‌గా సోహమ్ దేసాయ్ వ్యవహరిస్తున్నారు. అయితే, ఇంగ్లాండ్ టూర్‌ను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి ప్రధాన కారణం ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ను మెరుగుపరచడం, ఇంగ్లాండ్‌ వాతావరణానికి తగ్గట్టుగా శారీరకంగా వారిని సిద్ధం చేయడమే.

లార్డ్స్ లో ట్రైనింగ్

భారత జట్టు ఇప్పటికే లండన్‌లోని లార్డ్స్ మైదానంలో ట్రైనింగ్‌ను ప్రారంభించింది. బీసీసీఐ అందుకు సంబంధించిన సన్నాహకాల వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ట్రైనింగ్‌లో ప్రధానంగా ఫాస్ట్ బౌలర్లు బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్ పాల్గొన్నారు. వీరితో పాటు నూతన టెస్ట్ కెప్టెన్ శుభమన్ గిల్, వికెట్‌కీపర్ రిషభ్ పంత్, ఆల్‌రౌండర్ జడేజా కూడా పాల్గొన్నారు. ఈ టెస్ట్ సిరీస్‎కు భారత జట్టు హెడ్ కోచ్‎గా మాత్రం గౌతమ్ గంభీర్ ఉన్నారు.

37వ టెస్ట్ కెప్టెన్

ప్రస్తుతం టెస్ట్ క్రికెట్‌లో భారత జట్టు కొత్త యుగాన్ని ప్రారంభించనుందని చెప్పవచ్చు. ఎందుకంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత యువ ఆటగాడు శుభమన్ గిల్ కెప్టెన్‌గా నియమితులయ్యాడు. భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో 37వ కెప్టెన్‌గా గిల్ బాధ్యతలు చేపట్టాడు. అతని నాయకత్వంలో యంగ్ టీమ్‌ ఇండియా ఇంగ్లాండ్‌లో ఎలాగైనా విజయం సాధించాలని భావిస్తోంది. ఈ క్రమంలో విరాట్, రోహిత్ లేకుండా ఎలా రాణిస్తారో చూడాలి మరి.

ఐదు టెస్టుల సిరీస్

భారత్ – ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్‎లో భాగంగా జూన్ 20న లీడ్స్(Leeds)లో మొదటి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. తర్వాత మ్యాచ్‌లు వరుసగా Edgbaston, Lords, Old Trafford, The Oval వేదికలపై జరుగుతాయి. ఇక్కడ 2007 తర్వాత భారత్ ఇంగ్లాండ్ గడ్డపై టెస్ట్ సిరీస్ గెలవాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతుండటం విశేషం. మరోవైపు కొందరు ఇండియా ఏ ఆటగాళ్లు సీనియర్ జట్టు సభ్యులతో పాటు ఇప్పటికే ఇంగ్లాండ్‌ చేరుకున్నారు.

ఇవీ చదవండి:

ఐఎండీ అలర్ట్.. జూన్ 14 వరకూ ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు..

ఇన్వెస్టర్లకు అలర్ట్.. వచ్చే వారం రానున్న ఐపీఓలు ఇవే..

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 08 , 2025 | 06:45 PM