Upcoming IPOs: ఇన్వెస్టర్లకు అలర్ట్.. వచ్చే వారం రానున్న ఐపీఓలు ఇవే..
ABN , Publish Date - Jun 08 , 2025 | 04:26 PM
ఇన్వెస్టర్లకు కీలక అలర్ట్ వచ్చేసింది. మళ్లీ స్టాక్ మార్కెట్లో ఐపీఓల వీక్ (Upcoming IPOs) రానే వచ్చింది. అయితే ఈసారి నాలుగు IPOలు రాబోతున్నాయి. వీటిలో 3 SME IPOలు ఉండగా, ఒకటి మెయిన్‌బోర్డ్ నుంచి వస్తుంది.
ఎప్పటిలాగే మళ్లీ ఐపీఓల వీక్ రానే (Upcoming IPOs) వచ్చేసింది. జూన్ 9 నుంచి ప్రారంభమయ్యే వారంలో నాలుగు కంపెనీలు IPOలతో ముందుకు వస్తున్నాయి. వీటిలో ఒకటి మెయిన్ బోర్డు నుంచి వస్తుండగా, మిగిలిన మూడు SME విభాగానికి చెందినవి. ఈ కంపెనీల లక్ష్యం మార్కెట్ నుంచి రూ. 300 కోట్లకు పైగా సేకరించడం. దీంతోపాటు గంగా బాత్ ఫిట్టింగ్స్ షేర్లు జూన్ 11న NSE SMEలో లిస్ట్ కానున్నాయి.
ఓస్వాల్ పంప్స్
ఓస్వాల్ పంప్స్ అనేది నీటి పంపుల తయారీ సంస్థ. దీని IPO జూన్ 13 నుంచి జూన్ 17 వరకు ఉంటుంది. ఇది మెయిన్‌బోర్డ్ విభాగంలో వస్తుంది. దీని షేర్లు BSE, NSE రెండింటిలోనూ లిస్ట్ కానున్నాయి. IIFL క్యాపిటల్ ఈ IPOని నిర్వహిస్తోంది. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల వరకు కంపెనీ తన ధరల బ్యాండ్ గురించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. దీని గురించి కంపెనీ త్వరలో ప్రకటిస్తుంది.
సాచెరోమ్ IPO
సచిరోమ్ ఒక రసాయన తయారీ సంస్థ. దీని IPO జూన్ 9న ప్రారంభమై, జూన్ 11న ముగుస్తుంది. దీని షేర్ల ధర రూ.96-102 మధ్య ఉంటుంది. ఆ కంపెనీ రూ.61.62 కోట్లు సేకరించాలనుకుంటోంది. దీని షేర్లు NSE SME ప్లాట్‌ఫామ్‌లో లిస్ట్ కానున్నాయి. ఈ IPOను GYR క్యాపిటల్ అడ్వైజర్స్ నిర్వహిస్తోంది.
జైనిక్ పవర్ & కేబుల్స్
జైనిక్ పవర్ & కేబుల్స్ IPO జూన్ 10న ప్రారంభమై, జూన్ 12న ముగుస్తుంది. దీని షేర్ల ధర రూ.100 నుంచి రూ.110 మధ్య ఉంటుంది. ఈ కంపెనీ రూ.51.30 కోట్లు సేకరించాలనుకుంటోంది. ఈ IPO NSE SME ప్లాట్‌ఫామ్‌పై వస్తుంది. ఈ కంపెనీ విద్యుత్ కేబుల్స్, వైరింగ్‌లను తయారు చేస్తుంది. ఇది భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న విద్యుత్ మౌలిక సదుపాయాల రంగంలో పనిచేస్తుంది.
మోనోలిత్ ఇండియా
మోనోలితిష్ ఇండియా ఒక ఇంజనీరింగ్ కంపెనీ. ఇది జూన్ 12న తన IPOని తీసుకొస్తోంది. ఈ కంపెనీ రూ.82.02 కోట్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీని షేర్ల ధర రూ.135 నుంచి రూ.143 మధ్య ఉంటుంది. ఈ IPO జూన్ 16న ముగుస్తుంది. దీని షేర్లు NSE SME ప్లాట్‌ఫామ్‌లో లిస్ట్ కానున్నాయి. ఈ IPOను హెమ్ సెక్యూరిటీస్ నిర్వహిస్తోంది.
గమనిక: ఆంధ్రజ్యోతి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు చేయాలని సూచించదు. సమాచారం మాత్రమే అందిస్తుంది. మీకు పెట్టుబడులు చేయాలని ఆసక్తి ఉంటే, నిపుణుల సలహా సూచనలు తీసుకోవడం మంచిది.
ఇవీ చదవండి:
దేశంలో ట్సాక్స్ ఫ్రీ స్టేట్ గురించి తెలుసా.. ఎంత సంపాదించినా
4 శాతం వడ్డీకే రూ.3లక్షల లోన్.. రైతులకు కేంద్రం ఆఫర్..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..