ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Mosquito Viral Video: దోమ తెర వేసుకోమనేది ఇందుకే.. ఇతను ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో చూస్తే..

ABN, Publish Date - Jul 11 , 2025 | 06:41 PM

ఓ వ్యక్తి రాత్రి వేళ అడవిలోకి క్యాంపింగ్‌కు వెళ్లాడు. దోమ తెర కింద పడుకున్న అతడికి.. అర్ధరాత్రి లేవగానే షాకింగ్ సీన్ కనిపించింది. ఈ సీన్ చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు..

అసలే ఇది వర్షాకాలం. ఈ కాలంలో అటు వ్యాధులతో పాటూ ఇటు దోమల బెడద విపరీతంగా ఉంటుంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా డెంగీ, మలేరియా వంటి వ్యాధులకు గురి కావాల్సి ఉంటుంది. పడుకునే సమయంలో దోమ తెరలు తప్పనిసరిగా వాడాలని వైద్యులు పదే పదే సూచిస్తుంటారు. ఇప్పుడిదంతా ఎందుకు చెబుతున్నామంటే.. సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి రాత్రి వేళ దోమతెరలో పడుకున్నాడు. అయితే అర్ధరాత్రి లేచి చూడగా.. దోమ తెరపై షాకింగ్ సీన్ కనిపించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. వామ్మో.. ఇది దోమ తెరనా... లేక తేనె తుట్టనా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి రాత్రి వేళ అడవిలోకి క్యాంపింగ్‌కు వెళ్లాడు. దోమ తెర (Mosquito net) కింద పడుకున్న అతడికి.. అర్ధరాత్రి లేవగానే షాకింగ్ సీన్ కనిపించింది. అప్పటివరకూ ఎలాంటి దోమలూ లేని ఆ దోమ తెర వద్ద.. అర్ధరాత్రి ఒక్కసారిగా కుప్పలు కుప్పలుగా దోమలు దూసుకొచ్చాయి.

అన్నీ కలిసి టెంట్‌ను (Mosquitoes surrounding the net) చుట్టుముట్టేశాయి. చూసేందుకు అది దోమ తెరలా కాకుండా.. తేనె తుట్టలా కనిపించింది. ఈ సీన్ చూసి ఆ వ్యక్తి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఒకవేళ ఆ సమయంలో దోమ తెర లేకపోయి ఉండుంటే.. అతడి పరిస్థితి దారుణంగా ఉండుండేది. ఇది తలచుకుని అతను కూడా ఒక్కసారిగా అవాక్కయ్యాడు. తాను చూసిన ఈ షాకింగ్ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘వామ్మో.. ఇది దోమ తెరనా.. లేక తేనె తుట్టనా’.. అంటూ కొందరు, ‘దోమ తెర లేకపోయి ఉండుంటే.. ఇతడి పరిస్థితి అస్తిపంజరమే మిగిలేది’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 54 వేలకు పైగా లైక్‌లు, 1.1 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

ఇవి కూడా చదవండి..

కోబ్రా విషం ఎంత డేంజరో తెలుసా.. కాటేయగానే ఏం జరిగిందో చూడండి..

రోడ్డు పక్కన పడుకున్న మందుబాబు.. సమీపానికి వెళ్లిన చిరుత.. వాసన చూడడంతో..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jul 11 , 2025 | 06:41 PM