Share News

Cheetah Viral Video: రోడ్డు పక్కన పడుకున్న మందుబాబు.. సమీపానికి వెళ్లిన చిరుత.. వాసన చూడడంతో..

ABN , Publish Date - Jul 05 , 2025 | 01:52 PM

ఓ మందుబాబు రాత్రి వేళ రోడ్డు పక్కన నిద్రపోతున్నాడు. అయితే అర్ధరాత్రి సమయంలో ఓ చిరుత పులి ఆ ప్రాంతంలోకి ఎంటర్ అయింది. అటూ, ఇటూ తిరుగుతున్న చిరుత.. చివరకు మందు బాబు ఉన్న ప్రాంతంలోకి వెళ్లింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Cheetah Viral Video: రోడ్డు పక్కన పడుకున్న మందుబాబు.. సమీపానికి వెళ్లిన చిరుత.. వాసన చూడడంతో..

జనవాసాల్లోకి పులులు, చిరుతలు రావడం నిత్యం ఎక్కడో చోట చూస్తూనే ఉంటాం. ఇలాంటి సమయాల్లో మనుషులు, జంతువులపై దాడి చేయడం జరుగుతుంటుంది. అయితే ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు, మరికొన్నిసార్లు ఆశ్చర్యకర సంఘటనలు చోటు చేసుకోవడం చూస్తుంటాం. దాడి చేయాల్సిన పులులు, సింహాలు.. కామ్‌గా వెళ్లిపోవడం, భయపడి పారిపోవడం కూడా చూస్తుంటాం. ఇలాంటి తమాషా సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ మందుబాబు, చిరుతపులికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. మందుబాబు రోడ్డు పక్కన పడుకుని ఉండగా.. చిరుతపులి సమీపానికి వచ్చింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ మందుబాబు రాత్రి వేళ రోడ్డు పక్కన నిద్రపోతున్నాడు. అయితే అర్ధరాత్రి సమయంలో ఓ చిరుత పులి ఆ ప్రాంతంలోకి ఎంటర్ అయింది. అటూ, ఇటూ తిరుగుతున్న చిరుత.. చివరకు మందు బాబు ఉన్న ప్రాంతంలోకి వెళ్లింది.


రోడ్డు పక్కన పడుకుని ఉన్న మందుబాబుని చూడగానే.. ‘ఈ రోజుకు వీడిని తినేసి కడుపు నింపుకున్నాం’.. అని అనుకుంటూ మెల్లగా దగ్గరికి వెళ్లింది. చిరుత తన వద్దకు రావడం చూసిన మందుబాబు.. పారిపోకుండా అలాగే దాని వైపు చూస్తూ ఉన్నాడు. అతడి సమీపానికి వెళ్లిన చిరుత.. (leopard smelled drunk man) మూతి దగ్గరగా వెళ్లి వాసన చూస్తుంది. కంపు భరించలేకపోయిందో.. ఏమో గానీ.. ఆ చిరుత సైలెంట్‌గా అక్కడి నుంచి వెళ్లిపోయింది.


చిరుత వెళ్లిపోవడతో అతను హమ్మయ్య.. అనుకుంటూ ఊపిరి పీల్చుకున్నాడు. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘వాసనతోనే వణికించాడుగా’.. అంటూ కొందరు, ‘మందుబాబా.. మజాకా.. చిరుతకే చుక్కలు చూపించాడు’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 72 వేలకు పైగా లైక్‌లు, 2.3 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

నిర్లక్ష్యం ఇలాక్కూడా ఉంటుందా.. ఈ ఫ్రిడ్జ్‌ లోపల ఏముందో చూస్తే నోరెళ్లబెడతారు..

వర్షంలోనూ బట్టలు ఆరేసిందిగా.. ఈ ఐడియా చూస్తే అవాక్కవ్వాల్సిందే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jul 05 , 2025 | 01:52 PM