Watch Video: పని చేస్తున్నాడా.. ప్రాణాలు తీసుకుంటున్నాడా.. ఇతడి అతి తెలివి చూస్తే అవాక్కవ్వాల్సిందే..
ABN , Publish Date - Jul 04 , 2025 | 01:34 PM
ఓ వ్యక్తి అత్యంత ఎత్తైన నిర్మాణంపై పని చేస్తుంటాడు. బిల్డింగ్ చివరన కూర్చున్న అతను. చెక్క పలకలకు ఇనుప మేకులు కొడుతున్నాడు. ఇందులో అవాక్కవడానికి ఏమీ లేకున్నా.. ఆ సమయంలో అతను తీసుకున్న భద్రతా ఏర్పాట్లు చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు. ఇలాంటి సందర్భాల్లో..

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఎవరు ఏ పని చేసినా.. దాన్ని వీడియో తీయడం మాత్రం మర్చిపోరు. కొందరు వారి రోజు వారీ పనుల్లోనే చిత్రవిచిత్ర ప్రయోగాలు చేస్తూ నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. ఈ క్రమంలో కొందరు తెలివిగా చేస్తే.. మరికొందరు అతి తెలివిగా వ్యవహరిస్తూ ఏవేవో ప్రయోగాలు చేస్తుంటారు. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఎత్తైన నిర్మాణంపై ఓ వ్యక్తి పని చేస్తున్న తీరు చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘పని చేస్తున్నాడా.. ప్రాణాలు తీసుకుంటున్నాడా’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి అత్యంత ఎత్తైన నిర్మాణంపై పని చేస్తున్నాడు. బిల్డింగ్ చివరన కూర్చున్న అతను.. చెక్క పలకలకు ఇనుప మేకులు కొడుతున్నాడు. ఇందులో అవాక్కవడానికి ఏమీ లేకున్నా.. ఆ సమయంలో అతను తీసుకున్న భద్రతా ఏర్పాట్లు చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు. ఇలాంటి సందర్భాల్లో ఎవరైనా ప్రత్యేకంగా తయారు చేసిన బెల్టులు ధరించి పని చేస్తుంటారు.
అయితే అలాంటి బెల్టులు అందుబాటులో లేవో ఏమో గానీ.. (Man working with rope tied around his neck) ఇతను ఓ తాడు కట్టుకున్నాడు. తాడు కట్టుకుంటే కట్టుకున్నాడు గానీ.. అది నడుముకు కాకుండా.. ఏకంగా తన మెడకే కట్టుకున్నాడు. తాడును మెడకు కట్టి, మరో చివరను అక్కడే ఉన్న ఇనుప కడ్డీలకు కట్టేశాడు. పని చేస్తున్న సమయంలో ఏమాత్రం అటు, ఇటూ అయినా అతడికి ఉరి బిగుసుకునే అవకాశం ఉంది.
ఇదంతా నవ్వుకోవడం కోసం చేసినట్లుగా అనిపిస్తున్నా కూడా.. వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘తన చావుకు తానే ఏర్పాట్లు చేసుకున్నాడు’.. అంటూ కొందరు, ‘పని చేస్తున్నాడా.. ప్రాణాలు తీసుకుంటున్నాడా’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 వేలకు పైగా వ్యూ్స్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
నిర్లక్ష్యం ఇలాక్కూడా ఉంటుందా.. ఈ ఫ్రిడ్జ్ లోపల ఏముందో చూస్తే నోరెళ్లబెడతారు..
వర్షంలోనూ బట్టలు ఆరేసిందిగా.. ఈ ఐడియా చూస్తే అవాక్కవ్వాల్సిందే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి