Share News

Pakistan ATM Viral Video: వీళ్ల తెలివి తగలెయ్యా.. పాకిస్తాన్ ఏటీఎంలపై నెటిజన్ల ఫన్నీ రియాక్షన్..

ABN , Publish Date - Jul 04 , 2025 | 11:29 AM

పాకిస్తాన్‌లోని కరాచీకి చెందిన ఏటీఎం అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ వ్యక్తి ఫోన్ కెమెరా ఆన్ చేసుకుని ఏటీఎం రూమ్‌లోకి వెళ్లాడు. ఏటీఎం రూమ్ డోర్ తీయగానే.. లోపల ఓ వ్యక్తి డబ్బులు తీసుకుంటుంటాడు. ఇందులో విశేషమేమీ లేకున్నా.. ఆ గదిలో..

Pakistan ATM Viral Video: వీళ్ల తెలివి తగలెయ్యా.. పాకిస్తాన్ ఏటీఎంలపై నెటిజన్ల ఫన్నీ రియాక్షన్..

పాకిస్తాన్‌కు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అక్కడి పరిస్థితులను వివరిస్తూ కొందరు పాకిస్తానీయులు చేసే వీడియోలు నెటిజన్లకు తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. బొమ్మ యుద్ధ విమానాలతో రయ్యిన దూసుకెళ్లడం, ఎయిర్ పోర్టు నుంచి బయటికి వచ్చే ప్రయాణికులు ఆకుపచ్చ టవల్స్‌ను భుజాన వేసుకుని రావడం, నీటి కష్టాలపై చేసే ఫన్నీ వీడియోలు నిత్యం చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. పాకిస్తాన్‌ కరాచీకి చెందినదిగా చెబుతున్న ఈ వీడియోలో ఏటీఎంను చూసి నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. పాకిస్తాన్‌లోని (Pakistan) కరాచీకి చెందిన ఏటీఎం అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ వ్యక్తి ఫోన్ కెమెరా ఆన్ చేసుకుని ఏటీఎం రూమ్‌లోకి వెళ్లాడు. ఏటీఎం రూమ్ డోర్ తీయగానే.. లోపల ఓ వ్యక్తి డబ్బులు తీసుకుంటుంటాడు. ఇందులో విశేషమేమీ లేకున్నా.. ఆ గదిలో ఏసీ, సీసీ కెమెరాను చూసి అంతా అవాక్కవుతున్నారు.


దొంగలెవరూ ఎత్తుకుపోకుండా.. ఏసీ మిషన్ చుట్టూ (Lock for AC machine) ఇనుప గ్రిల్ వేసి తాళం వేశారు. అలాగే సీసీ కెమెరాను (Lock on CCTV camera) లాక్కుపోకుండా ఇలాగే ఇనుప గ్రిల్ అమర్చారు. ఈ రెండింటినీ పగడ్బందీగా ఏర్పాటు చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. విలువైన ఏటీఎం మిషిన్‌కు ఉండగా.. ఏసీకి, సీసీ కెమెరాకు తాళం వేయడం అంతా అవాక్కయ్యేలా చేస్తోంది.


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘పాకిస్తానీయుల ఐడియా మామూలుగా లేదుగా’.. అంటూ కొందరు, ‘ఏసీ, సీసీ కెమెరా ఎంతో విలువైనవి’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2.5 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

వర్షంలోనూ బట్టలు ఆరేసిందిగా.. ఈ ఐడియా చూస్తే అవాక్కవ్వాల్సిందే..

బ్రిడ్జి వద్ద ఏకాంతంగా కలిసిన ప్రేమ జంట.. ఇంతలో పొంగుకొచ్చిన వరద నీరు.. చివరకు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jul 04 , 2025 | 11:29 AM