Woman Viral Video: వర్షంలోనూ బట్టలు ఆరేసిందిగా.. ఈ ఐడియా చూస్తే అవాక్కవ్వాల్సిందే..
ABN , Publish Date - Jul 03 , 2025 | 12:56 PM
ఓ మహిళ వర్షంలో బట్టలు ఆరేసిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఆరుబయట బట్టలు ఆరేసిన సమయంలో వర్షం వచ్చింది. ఇలాంటి సమయాల్లో ఎవరైనా దుస్తులను వెంటనే ఇంట్లోకి తీసుకెళ్లిపోతారు. అయితే ఈమె అలా చేయకుండా సింపుల్ ట్రిక్‌తో బట్టలను వర్షంలోనే ఆరేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు..

మహిళల ఆలోచనలు కొన్నిసార్లు విచిత్రంగా అనిపిస్తుంటాయి. కొందరు తమ రోజు వారీ ఇంటి పనులను చిత్రవిచిత్రంగా చేస్తుంటారు. ఓ మహిళ సైకిల్ చక్రాల సాయంతో బట్టలు ఉతికితే.. మరో మహిళ, బట్టలు ఉతకాల్సిన వాషింగ్ మెషిన్‌లో గిన్నెలను శుభ్రం చేస్తుంది. అలాగే ఇంకో మహిళ ఏకంగా ఇటుకలతోనే వాషింగ్ మిషిన్‌ను నిర్మించింది. ఇలాంటి చిత్రవిచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. వర్షంలో దుస్తులను ఆరబెట్టిన మహిళను చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ఐడియా అదుర్స్.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ వర్షంలో బట్టలు ఆరేసిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఆరుబయట బట్టలు ఆరేసిన సమయంలో వర్షం వచ్చింది. ఇలాంటి సమయాల్లో ఎవరైనా దుస్తులను వెంటనే ఇంట్లోకి తీసుకెళ్లిపోతారు. అయితే ఈమె అలా చేయకుండా (Woman drying clothes in rain) సింపుల్ ట్రిక్‌తో బట్టలను వర్షంలోనే ఆరేసింది.
తాడుపై వరుసుగా ఉన్న బట్టలపై పాలిథిన్ కవర్ కప్పేసింది. దుస్తులపై కవర్ కప్పిన తర్వాత, అది కిందపడిపోకుండా క్లిప్‌లు పెట్టేసింది. దీంతో ఎంత పెద్ద వర్షం కురిసినా కూడా బట్టలు తడవకుండా ఎంచక్కా ఆరిపోయాయన్నమాట. ఈమె విచిత్రమైన ఐడియా చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతోంది.
ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఐడియా మామూలుగా లేదుగా’.. అంటూ కొందరు, ‘ఆలోచన బాగుంది కానీ.. ఇలా చేస్తే బట్టలు ఎలా ఆరతాయి’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3 లక్షలకు పైగా లైక్‌లు, 31.1 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
బ్రిడ్జి వద్ద ఏకాంతంగా కలిసిన ప్రేమ జంట.. ఇంతలో పొంగుకొచ్చిన వరద నీరు.. చివరకు..
మీ దుంపలు తెగా.. చైనాను మించిపోయారు కదరా.. ఆమ్లెట్ ఎలా చేస్తున్నాడో చూడండి..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి