Viral Video: ఈ హోటల్లో అప్పు పెట్టాలంటే ఆలోచించాల్సిందే.. యజమాని ఏం రాశాడో చూస్తే..
ABN , Publish Date - Jul 03 , 2025 | 06:45 AM
ఓ హోటల్ యజమాని అప్పుల బాధ నుంచి తప్పించుకోవడానికి విచిత్రమైన ఉపాయం ఆలోచించాడు. అప్పు అడగరాదు అనే బోర్డు పెడితే ప్రయోజనం లేదనుకున్నాడో ఏమో గానీ.. కస్టమర్లు అవాక్కయ్యేలా చేశాడు. ఆ హోటల్‌కు వచ్చిన వారంతా గోడపై అంటించిన పోస్టర్ చూసి నోరెళ్లబెడుతున్నారు.

‘అన్నా రాసుకో.. తర్వాత ఇస్తా..’ చాలా మంది వ్యాపారులకు తరచూ వినిపించే మాట ఇది. కొందరికి ఇదే పెద్ద సమస్యగా మారుతుంటుంది. అప్పు చేసిన వారి లిస్ట్ పెరుగుతుంటుందే తప్ప.. అప్పు తీర్చే వారు మాత్రం కనుచూపు మేరలో కనిపించరు. దీంతో లాభాలు వచ్చే అవకాశం ఉన్నా కూడా ఇలా అప్పులు పోవడం వల్ల వ్యాపారులు నష్టపోవాల్సి వస్తుంటుంది. దీనికి పరిష్కారంగా ఏ వ్యాపారి అయినా తమ దుకాణంలో ‘అప్పు అడగరాదు’.. అనే బోర్డు పెట్టడం చూస్తుంటాం. అయినా అప్పు పెట్టే వారు మాత్రం ఇదేమీ పట్టించుకోకుండా యథావిధిగా అప్పులు పెడుతునే ఉంటారు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. ఇలాంటి అప్పురాయుళ్లకు షాక్ ఇచ్చేలా ఓ దుకాణదారుడు వినూత్న నిర్ణయం తీసుకున్నాడు. ఇతడి రాసిన నోట్ చూసి అంతా నోరెళ్లబెడుతున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ హోటల్ (Hotel Owner ) యజమాని అప్పుల బాధ నుంచి తప్పించుకోవడానికి విచిత్రమైన ఉపాయం ఆలోచించాడు. అప్పు అడగరాదు అనే బోర్డు పెడితే ప్రయోజనం లేదనుకున్నాడో ఏమో గానీ.. కస్టమర్లు అవాక్కయ్యేలా చేశాడు. ఆ హోటల్‌కు వచ్చిన వారంతా గోడపై అంటించిన పోస్టర్ చూసి నోరెళ్లబెడుతున్నారు.
ఆ పేపర్‌పై అప్పు (Debts) అడగరాదు.. అన్న అక్షరాలకు బదులుగా.. ‘అప్పు తీసుకుంటే.. అదనంగా రూ.5లు వడ్డీ చెల్లించి ఇవ్వాల్సి ఉంటుంది’.. అని రాశాడు. దీంతో హోటల్‌కు వచ్చిన వాంరతా అప్పు అడిగేందుకు ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి వస్తోంది. ఇలా ఈ హోటల్ యజమాని వింతగా ఆలోచించి, అప్పుల బాధ నుంచి తప్పించుకున్నాడన్నమాట.
కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఐడియా మామూలుగా లేదుగా’.. అంటూ కొందరు, ‘వడ్డీ వేశారు బాగానే ఉంది.. అది కూడా ఎగ్గొడితే పరిస్థితి ఏంటీ’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో 18 వేలకు పైగా లైక్‌లు, 1.1 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.