Share News

Fridge Viral Video: నిర్లక్ష్యం ఇలాక్కూడా ఉంటుందా.. ఈ ఫ్రిడ్జ్‌ లోపల ఏముందో చూస్తే నోరెళ్లబెడతారు..

ABN , Publish Date - Jul 04 , 2025 | 10:01 AM

ఓ ఇంట్లో ఫ్రిడ్జ్ లోపల దృశ్యం అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది. సాధారణంగా ఏ ఫ్రిడ్జ్‌లో అయినా కూరగాయలు, పండ్లు, పాలు తదితర ఆహార పదార్థాలను స్టోర్ చేయడం చూస్తుంటాం. కానీ ఈ ఇంట్లో ఫ్రిడ్జ్ డోరు తెరవగానే..

Fridge Viral Video: నిర్లక్ష్యం ఇలాక్కూడా ఉంటుందా.. ఈ ఫ్రిడ్జ్‌ లోపల ఏముందో చూస్తే నోరెళ్లబెడతారు..

కొందరికి ఎవరికీ రాని చిత్రవిచిత్రమైన ఐడియాలన్నీ వస్తుంటాయి. ఎక్కడ ఏం చేయకూడదో అదే చేస్తుంటారు. ఓ వ్యక్తి గ్యాస్ స్టవ్‌‌ను వంట కోసం కాకుండా.. షవర్‌గా వాడతాడు. మరో మహిళ వ్యక్తి వేడి వేడి కుక్కర్‌ను ఐరన్ బాక్స్‌లా వాడుతుంది. ఇంకో మహిళైతే.. దుస్తులు వేయాల్సిన వాషింగ్ మెషిన్‌‌లో వంట పాత్రలను శుభ్రం చేస్తుంది. ఇలాంటి చిత్రవిచిత్రమైన ప్రయోగాలు చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఇలాంటి విచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ కుటుంబం ఫ్రిడ్జ్‌ను వాడిన విధానం చూసి అంతా షాక్ అవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘ఫ్రిడ్జ్‌ వాడుతున్నారా.. మొక్కలు పెంచుతున్నారా..’... అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ ఇంట్లో ఫ్రిడ్జ్ లోపల దృశ్యం అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది. సాధారణంగా ఏ ఫ్రిడ్జ్‌లో అయినా కూరగాయలు, పండ్లు, పాలు తదితర ఆహార పదార్థాలను స్టోర్ చేయడం చూస్తుంటాం. కానీ ఈ ఇంట్లో ఫ్రిడ్జ్ డోరు తెరవగానే లోపల ఏకంగా ఓ పెద్ద మొక్క కనిపించింది.


ఫ్రిడ్జ్ లోపల కింద అరలో కూరగాయలను కవర్‌లో చుట్టి పెట్టారు. అయితే చాలా రోజులుగా పట్టించుకోవడం లేదో.. లేక కావాలని అలా చేశారో తెలీదు గానీ.. కొన్ని రోజులకు అందులో నుంచి మొలక వచ్చింది. అలాగే వదిలేయడంతో ఆ మొలక కాస్త మొక్కగా మారింది. కింద అర నుంచి పై అర వరకూ (Plant Grown in Fridge) పెరుగుతూ వెళ్లింది. ఇది చూసేందుకు ఫ్రిడ్జ్‌లా కాకుండా పూల కుండీలా కనిపిస్తోంది. ఈ ఫ్రిడ్జ్ చూసి అంతా అవాక్కవుతున్నారు.


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఈ ఫ్రిడ్జ్ డోర్లు ఎన్ని రోజుల నుంచి తెరవలేదో ఏమో’.. అంటూ కొందరు, ‘ఇది ఫ్రిడ్జ్ అనుకున్నారా.. పూలకుండీ అనుకున్నారా’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 66 వేలకు పైగా లైక్‌లు, 4.7 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

వర్షంలోనూ బట్టలు ఆరేసిందిగా.. ఈ ఐడియా చూస్తే అవాక్కవ్వాల్సిందే..

బ్రిడ్జి వద్ద ఏకాంతంగా కలిసిన ప్రేమ జంట.. ఇంతలో పొంగుకొచ్చిన వరద నీరు.. చివరకు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jul 04 , 2025 | 10:23 AM