Share News

Funny Viral Video: అప్రమత్తమైనా లాభమేది.. ఫోన్ ఎలా పోగొట్టుకున్నాడంటే..

ABN , Publish Date - Jul 04 , 2025 | 07:47 AM

ఓ వ్యక్తి కిటికీ పక్కనే సోఫాలో పడుకుని ఉన్నాడు. ఇంతలో కిటికీ అవతలి వైపు ఉన్న దొంగ.. ఇతడి ఫోన్‌పై కన్నేశాడు. కిటికీ బయటికి నుంచి ఓ కర్ర పుల్లను లోపలికి పెట్టి, ఫోన్‌ను తీసుకున్నాడు. అయితే తీరా ఫోన్‌ను తీసుకునేలోపు..

Funny Viral Video: అప్రమత్తమైనా లాభమేది.. ఫోన్ ఎలా పోగొట్టుకున్నాడంటే..
phone theft funny video

కొన్నిసార్లు ఎంత అప్రమత్తంగా ఉన్నా కూడా ప్రమాదాల్లో చిక్కుకోవడమో, ఎదుటివారి చేతిలో మోసపోవడమో జరుగుతుంటుంది. ఇలాంటి సమయాల్లో మనకు తెలీకుండానే చేసే చిన్న చిన్న పొరపాట్లే ఇందుకు కారణమని చెప్పొచ్చు. ఇందుకు నిదర్శనంగా నిత్యం మన కళ్ల ముందు అనేక సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, ఇలాంటి సందర్భాన్ని గుర్తు చేసే ఓ ఫన్నీ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి ఎంతో అప్రమత్తంగా ఉన్నా కూడా ఫోన్ ఎలా పోగొట్టుకున్నాడో చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. దక్కనిది ఎన్నటికీ దక్కదు.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి కిటికీ పక్కనే సోఫాలో పడుకుని ఉన్నాడు. ఇంతలో కిటికీ అవతలి వైపు ఉన్న దొంగ.. ఇతడి ఫోన్‌పై కన్నేశాడు. కిటికీ బయటికి నుంచి ఓ కర్ర పుల్లను లోపలికి పెట్టి, ఫోన్‌ను తీసుకున్నాడు. అయితే తీరా ఫోన్‌ను తీసుకునేలోపు పడుకున్న వ్కక్తి వెంటనే పైకి లేచాడు. తన ఫోన్‌ను తీసుకోవడం చూసి షాకైనా అతను.. క్షణాల వ్యవధిలో తన ఫోన్‌ను లాగేసుకున్నాడు. దీంతో దొంగ ప్రయత్నాలు విఫలమవుతాయి.


అయితే అంతటితో సైలెంట్‌గా ఉండని ఆ వ్యక్తి.. ఫోన్ లైట్ ఆన్ చేసి, కిటికీ బయట ఎవరున్నారో చూసేందుకు ప్రయత్నించాడు. ఫోన్‌ను కిటికీ బయటికి పెట్టి మరీ వెతుకుతాడు. సమయం కోసం వేచి ఉన్న దొంగ.. (Thief steals phone ) ఫోన్ బయటికి పెట్టగానే లటుక్కున లాగేసుకుని పారిపోతాడు. దీంతో అతను ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఎంతో అప్రమత్తంగా వ్యవహరించి తన ఫోన్‌ను కాపాడుకున్న ఆ వ్యక్తి.. అంతలోనే నిర్లక్ష్యంగా వ్యవహరించి దొంగ చేతికి అందించడం అందరికీ నవ్వు తెప్పిస్తోంది.


ఇదంతా నవ్వుకోవడానికి చేసినా కూడా వీడియో మాత్రం తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘అప్రమత్తంగా ఉన్నా కూడా ప్రయోజనం లేకుండా పోయింది’.. అంటూ కొందరు, ‘ఫోన్‌ను దొంగ చేతికే అందించాడుగా’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 250కి పైగా లైక్‌లు, 31 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

వర్షంలోనూ బట్టలు ఆరేసిందిగా.. ఈ ఐడియా చూస్తే అవాక్కవ్వాల్సిందే..

బ్రిడ్జి వద్ద ఏకాంతంగా కలిసిన ప్రేమ జంట.. ఇంతలో పొంగుకొచ్చిన వరద నీరు.. చివరకు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jul 04 , 2025 | 08:21 AM