Share News

Floods Viral Video: వరద నీటిలో బైకుపై వెళ్తున్న జంట.. ఎదురుగా వచ్చిన మహీంద్రా థార్.. చివరకు..

ABN , Publish Date - Jul 05 , 2025 | 12:53 PM

భారీ వర్షాల (Heavy Rains) కారణంగా రోడ్డుపై వరద నీరు (Flood Water) మోకాలి కంటే పైగా ప్రవహిస్తుంటుంది. ఆ సమయంలో ఓ వ్యక్తి తన భార్యను బైకుపై ఎక్కించుకుని అటుగా వచ్చాడు. వరద నీరు భారీగా ప్రవహిస్తున్నా కూడా లెక్కచేయకుండా బైకును నీటిలోకి దింపేశాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Floods Viral Video: వరద నీటిలో బైకుపై వెళ్తున్న జంట.. ఎదురుగా వచ్చిన మహీంద్రా థార్.. చివరకు..

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వరదల దాటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో వరద నీరు రోడ్లపైకి చేరడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. కొన్నిచోట్ల ప్రమాదాలకు గురవడం చూస్తున్నాం. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల మీడియాలోయ తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా, ఓ జంటకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. రోడ్డుపై వరద నీరు ప్రవహిస్తున్నా లెక్కచేయకుండా ఓ వ్యక్తి తన భార్యను బైకుపై ఎక్కించుకుని దూసుకెళ్లాడు. అయితే ఎదురుగా మహీంద్రా థార్ వాహనం రావడంతో చివరకు షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.


ఎక్కడ జరిగిందో ఏమో తెలీదు గానీ.. సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. భారీ వర్షాల (Heavy Rains) కారణంగా రోడ్డుపై వరద నీరు (Flood Water) మోకాలి కంటే పైగా ప్రవహిస్తుంటుంది. ఆ సమయంలో ఓ వ్యక్తి తన భార్యను బైకుపై ఎక్కించుకుని అటుగా వచ్చాడు. వరద నీరు భారీగా ప్రవహిస్తున్నా కూడా లెక్కచేయకుండా బైకును నీటిలోకి దింపేశాడు. మెల్లగా ఎలాగోలా వాహనాన్ని నడుపుకుంటూ వెళ్తుంటాడు.


అయితే ఇంతలో ఎదురుగా (Mahindra Thar vehicle) మహీంద్రా థార్ వాహనం వస్తుంది. వాహనం వేగంగా వస్తుండడంతో నీళ్లు అలలుగా వచ్చి (Couple fell into flood water) బైకుపై ఉన్న వాళ్లు కిందపడిపోతారు. అయితే ఆ వ్యక్తి ఎలాగోలా బైకును బ్యాలెన్స్ చేసుకుంటాడు. థార్ వాహనంలోని వారు వేగంగా నడపడమే కాకుండా దంపతులు కిందపడిపోయినా లెక్కచేయకుండా వాహనం ఆపకుండా అక్కడి నంచి వెళ్లిపోతారు. తర్వాత ఆ వ్యక్తి తన భార్యను ఎక్కించుకుని ఎలాగోలా అక్కడి నుంచి బయటపడతాడు. ఈ ఘటనలో వారికి ఎలాంటి గాయాలూ కాకున్నా.. ఇద్దరూ వరద నీటిలో తడిచిపోయారు.


ఆ సమయంలో అక్కడే ఉన్న కొందరు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘థార్ వాహనంలో వెళ్లే వారు కనీస జ్ఞానం కూడా లేకుండా వ్యవహరిస్తున్నారు’.. అంటూ కొందరు, ‘ఇలాంటి సమయాల్లో ప్రయాణం చేయడం చాలా ప్రమాదం’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 6500కి పైగా లైక్‌లు, 6.29 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

నిర్లక్ష్యం ఇలాక్కూడా ఉంటుందా.. ఈ ఫ్రిడ్జ్‌ లోపల ఏముందో చూస్తే నోరెళ్లబెడతారు..

వర్షంలోనూ బట్టలు ఆరేసిందిగా.. ఈ ఐడియా చూస్తే అవాక్కవ్వాల్సిందే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jul 05 , 2025 | 12:53 PM