Woman Viral Video: ఫోన్‌కు ఎడిక్ట్ అయిన కూతురు.. తల్లి చేసిన ఒక్క పనితో.. చివరకు..
ABN , Publish Date - Jul 05 , 2025 | 11:31 AM
ఓ యువతి డైనింగ్ టేబుల్ ముందు కూర్చుని స్నాక్స్ తింటూ ఉంటుంది. అయితే ఈ సమయంలోనూ ఆమె ఫోన్ చూసుకుంటూ ఉంది. అది కూడా.. పూర్తిగా ఫోన్‌లో లీనమై ఉంటుంది. దీంతో ఆమె తల్లికి చిర్రెత్తుకొచ్చి చివరకు షాక్ ఇచ్చింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు..

ప్రస్తుత స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో పసి పిల్లల నుంచి పండు ముదుసలి వరకూ ప్రతి ఒక్కరిలో స్మార్ట్ ఉండడం కామన్ అయిపోయింది. కొందరు ఈ ఫోన్ సాయంతో ఆదాయం గడిస్తుండగా.. మరికొందరు నిత్యం ఫోన్ చూస్తూ అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. తమ పిల్లలను ఎంత మార్చాలని చూసినా వారిలో మాత్రం మార్పు రావడం లేదు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. సోషల్ మీడియాలో ఓ ఫన్నీ తెగ వైరల్ అవుతోంది. నిత్యం ఫోన్‌లో మునిగిపోతున్న కూతురుకు ఓ తల్లి షాక్ ఇచ్చింది. ఆమె చేసిన పని చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి డైనింగ్ టేబుల్ ముందు కూర్చుని స్నాక్స్ తింటూ ఉంటుంది. అయితే ఈ సమయంలోనూ ఆమె ఫోన్ చూసుకుంటూ ఉంది. అది కూడా.. పూర్తిగా ఫోన్‌లో లీనమై ఉంటుంది. తినేకంటే ఫోన్ చూడడమే ముఖ్యం అన్నట్లుగా ఆమె ప్రవర్తన ఉంటుంది.
ఇదంతా గమనించిన ఆమె తల్లికి చిర్రెత్తుకొచ్చింది. ఇంకేముందీ.. చేతిలో ఓ టేప్‌తో అక్కడికి వచ్చింది. వచ్చీరావడంతోనే కూతురు ముఖానికి, (Mother taped phone to daughter's face) ఫోన్‌కు జాయింట్‌గా టేప్ వేసేస్తుంది. ముఖానికి ఫోన్ ఆనించి మరీ మొత్తం టేప్ వేసేసి వెళ్లిపోతుంది. తల్లి చేసిన ఈ పనికి కూతురు షాక్ అవుతుందన్నమాట. ఇదంతా నవ్వుకోవడానికి చేసినట్లుగా అనిపిస్తున్నా కూడా.. వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఫోన్ పిచ్చి వదిలించింగా’’.. అటూ కొందరు, ‘చాలా మంచి పని చేసింది’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 91 వేలకు పైగా లైక్‌లు, 7.5 మిలియన్‌కు పైగా వ్యూ్స్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
నిర్లక్ష్యం ఇలాక్కూడా ఉంటుందా.. ఈ ఫ్రిడ్జ్ లోపల ఏముందో చూస్తే నోరెళ్లబెడతారు..
వర్షంలోనూ బట్టలు ఆరేసిందిగా.. ఈ ఐడియా చూస్తే అవాక్కవ్వాల్సిందే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి