ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Snake Viral Video: బెలూన్‌ ఊది పామును రెచ్చగొట్టాడు.. చివరకు జరిగింది చూసి ఖంగుతిన్నాడు..

ABN, Publish Date - Aug 06 , 2025 | 08:06 PM

ఓ వ్యక్తి పామును టేబుల్‌పై పెట్టి, దాని ముందు బెలూన్ ఊది పట్టుకున్నాడు. బెలూన్‌ను పదే పదే పాము ముందకు తీసుకెళ్తూ రెచ్చగొట్టాడు. పాము బెలూన్ దగ్గరికి రాగానే బుసలు కొడుతూ భయపెడుతుంది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

పాములకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కొందరు పాము ముందు ఫన్నీ గేమ్స్ ఆడడడం చూస్తుంటాం. బూర ఊదుతూ కొందరు, డాన్స్ చేస్తూ మరికొందరు పాములను రెచ్చగొడుతుంటారు. అయితే ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, ఓ పాము వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి పాము ముందు బెలూన్ ఊది రెచ్చగొట్టాడు. ఈ వీడియో చూసిన వారంతా.. షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి పామును టేబుల్‌పై పెట్టి, దాని ముందు బెలూన్ ఊది పట్టుకున్నాడు. బెలూన్‌ను పదే పదే పాము ముందకు తీసుకెళ్తూ రెచ్చగొట్టాడు. పాము బెలూన్ దగ్గరికి రాగానే బుసలు కొడుతూ భయపెడుతుంది. ఇలా పాము ముందు చాలా సేపు అతను అలా బెలూన్‌తో ఆటలాడాడు.

అయితే చివరకు ఆ పాముకు చిర్రెత్తుకొచ్చిందో ఏమో గానీ.. తీరా బెలూన్ దగ్గరికి రాగానే, (Snake Bursts The Balloon) ఒక్క కాటుతో దాన్ని బద్ధలుకొడుతుంది. దీంతో అప్పటిదాకా బెలూన్‌తో గేమ్స్ ఆడిన వ్యక్తి కాస్తా అవాక్కవుతాడు. చూస్తుంటే.. అనుభవం కలిగిన స్నేక్ క్యాచర్.. ఇలా వింత ప్రయోగం చేసినట్లుగా అనిపిస్తోంది. ఈ ఘటనను అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘పాము ముందు గేమ్స్ ఆడితే ఇలాగే అవుతుంది’.. అంటూ కొందరు, ‘బెలూన్ గేమ్ అంటే ఈ పాముకు బాగా ఇష్టమున్నట్లుంది’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 6 వేలకు పైగా లైక్‌లు, 4 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

ఇవి కూడా చదవండి..

ఆహా.. అవ్వా..! నీ తెలివికి జోహార్లు.. ఫ్రిడ్జ్‌ను ఎలా వాడిందో చూడండి..

నీళ్లలోని మొసలికి ఎంత పవర్ ఉంటుందో తెలుసా.. జీపు కింద పడడంతో చివరకు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Aug 06 , 2025 | 08:06 PM