ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Water Purifying Tricks: రూపాయి ఖర్చు లేకుండా.. మురుగు నీటిని ఫిల్టర్ నీరుగా మార్చేశాడుగా..

ABN, Publish Date - Aug 09 , 2025 | 03:42 PM

ఓ వ్యక్తి మురుగు నీటిని చూస్తుండగానే స్వచ్ఛమైన తాగునీటిలా మార్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ముందుగా అతను సగానికి కట్ చేసిన ప్లాస్టిక్ బాటిల్‌లో మురుగు నీటిని తీసుకున్నాడు. దాన్ని ఓ రాయిపై ఉంచి..

కొందరు తమ తెలివితేటలతో పెద్ద పెద్ద సమస్యలకు సింపుల్‌గా పరిష్కారాలు చూపిస్తుంటారు. మరికొందరు అందుబాటులో ఉన్న వస్తువులతోనే అద్భుతాలు చేస్తుంటారు. ఇంకొందరు చేసే పనులు చూస్తే ఆశ్చర్య కలుగుతుంటుంది. ఇలాంటి వింత వింత ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి రూపాయి ఖర్చు లేకుండా మురికి నీటిని ఫిల్టర్ నీటిలా మార్చేశాడు. ఇతడి ప్రయోగం చూసి అంతా34 అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ఇతడి టెక్నిక్ మామూలుగా లేదుగా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి మురుగు నీటిని (Sewage) చూస్తుండగానే స్వచ్ఛమైన తాగునీటిలా (Pure water) మార్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ముందుగా అతను సగానికి కట్ చేసిన ప్లాస్టిక్ బాటిల్‌లో మురుగు నీటిని తీసుకున్నాడు. దాన్ని ఓ రాయిపై ఉంచి.. దాని కిందే మరో ప్లాస్టిక్ గ్లాసు పెట్టాడు.

పైన ఉన్న గ్లాసు నుంచి ఓ కాటన్‌ను కింద ఉన్న గ్లాసులోకి పెట్టాడు. దీంతో మురుగు నీరు మొత్తం.. కాటన్ గుండా బొట్టు బొట్టుగా కింద ఉన్న ప్లాస్టిక్ గ్లాసులోకి వచ్చి చేరింది. అందులోకి వచ్చిన నీటిని మళ్లీ ఓ కాటన్ ద్వారా దాని కింద ఉన్న గాజు గ్లాసులోకి వెళ్లేలా చేశాడు. ఇలా గాజు గ్లాసులోకి వచ్చిన శుభ్రమైన నీటిని.. ఆ తర్వాత నిప్పులపై వేడి చేశాడు. వేడి చేసే ముందు అందులో రంగు రాళ్ల తరహాలో ఉన్న కొన్నింటిని కలిపేశాడు.

ఇలా కొద్దిసేపు వేడి చేయగానే.. చివరకు ఫిల్టర్ నీరు రెడీ అయిపోయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలోని వివిధ వేదికల్లో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘వావ్.. ఈ ట్రిక్ మామూలుగా లేదుగా’.. అంటూ కొందరు, ‘అడవుల్లో ఉన్న సమయంలో ఈ ట్రిక్ ఎంతో ఉపయోగపడుతుది’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

ఇళ్లల్లోకి పాములు రాకుండా ఉండాలంటే.. సింపుల్‌గా ఇలా చేయండి చాలు..

నిర్జీవంగా పడి ఉన్న భాగస్వామి.. గమనించిన హంస చివరకు ఏం చేసిందో చూస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Aug 09 , 2025 | 04:01 PM