ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

National Animal And Bird: స్వాతంత్య్ర దినోత్సవం రోజున పులి, నెమలి కవాతు.. వీడియో వైరల్..

ABN, Publish Date - Aug 15 , 2025 | 07:25 PM

పంద్రాగస్టు రోజున అడవిలో సంచరిస్తున్న వన్యప్రాణి ఫోటోగ్రాఫర్ రాకేష్ భట్‌కు ఓ అరుదైన దృశ్యం కనిపించింది. మన జాతీయ జంతువు,, జాతీయ పక్షి రెండూ కలిసి ఒకే దారిలో ఒకదాని వెనుక మరొకటి నడుస్తూ కనిపించాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ఇది అరుదైన దృశ్యం.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..

79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఇండియా మొత్తం ఉత్సవాల్లో మునిగిపోయింది. ఆగస్టు 15 సందర్భంగా గ్రామం మొదలుకొని పట్టణాలు, నగరాల్లోని పాఠశాలలు, కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగురవేయడం, జాతీయ గీతాన్ని ఆలపించడం, కవాతు నిర్వహించడం తదితర కార్యక్రమాలు నిర్వహించడం చూస్తుంటాం. ఇందుకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అయితే ఈ పంద్రాగస్టు వేడుకల సందర్భంగా అడవిలో ఆసక్తిర సంఘటన చోటు చేసుకుంది. జాతీయ జంతువు, జాతీయ పక్షి రెండూ కలిసి కవాతు నిర్వహించాయి. ఈ వీడియో ప్రస్తతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన వారంతా ‘అరుదైన అద్భుత దృశ్యం’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఉత్తరాఖండ్‌లోని (Uttarakhand) జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. పంద్రాగస్టు రోజున అడవిలో సంచరిస్తున్న వన్యప్రాణి ఫోటోగ్రాఫర్ రాకేష్ భట్‌కు ఓ అరుదైన దృశ్యం కనిపించింది. మన జాతీయ జంతువైన పులి (National Animal), జాతీయ పక్షి (National Bird) అయిన నెమలి రెండూ కలిసి ఒకే దారిలో ఒకదాని వెనుక మరొకటి నడుస్తూ కనిపించాయి.

స్వాతంత్య్ర దినోత్సవం (Independence Day) రోజున ఈ రెండూ కలిసి ఇలా నడుస్తూ కనిపించడంతో.. అందిరికీ అవి కవాతు చేస్తున్నట్లు అనిపించింది. నెమలి అడుగులో అడుగు వేసుకుంటూ ముందు వైపు వెళ్తుండగా.. వెనుక పులి దాన్ని అనుసరిస్తూ వస్తోంది. ఇలా ఆ రెండూ కలిసి చాలా దూరం వరకూ అలా మెల్లిగా నడుస్తూ వెళ్లాయి. ఈ సమయంలో అక్కడే ఉన్న ఫోటోగ్రాఫర్ రాకేష్ భట్‌.. ఆ దృశ్యాలను తన కెమరాలో బంధించాడు. ఈ వీడియోను IFS అధికారి పీఎం ధాకటే తన ఎక్స్‌ ఖాతాలో షేర్ చేశాడు.

ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘వావ్.. ఇది ఎంతో అరుదైన, అద్భుత దృశ్యం’.. అంటూ కొందరు, ‘జాతీయ జంతువు, జాతీయ పక్షి కలిసి ఓకే ఫ్రేమ్‌లో కనిపించడం ఎప్పుడూ చూడలేదు’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

ఇవి కూడా చదవండి..

చేపలు పడుతున్న వ్యక్తి.. వెనుకే వెళ్లిన సింహం.. చివరకు చూస్తే..

కోతులను కర్రతో తరిమికొట్టాడు.. చివరకు జరిగింది చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Aug 15 , 2025 | 07:25 PM