ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Operation Sindoor: దీపావళి రాకెట్ కాదురా బాబు.. అది మిస్సైల్..

ABN, Publish Date - May 11 , 2025 | 11:01 AM

Operation Sindoor: గత కొద్దిరోజుల భీకరంగా సాగిన భారత్, పాకిస్తాన్ యుద్ధం ముగిసింది. నిన్న రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఆ తర్వాత త్రివిధ దళాలు దాడులను ఆపేశాయి. యుద్ధంలో పాకిస్తాన్ భారీగా నష్టపోయింది.

Viral Video

భారత్, పాకిస్తాన్‌ల మధ్య యుద్ధంలో పాక్ కోలుకోలేని దెబ్బ తింది. భారత్ వదిలిన మిస్సైల్స్, డ్రోన్లు ఆ దేశంలో విధ్వంసం సృష్టించాయి. ఏయిర్ బేస్లు, ఇతర మిలటరీ స్థావరాలను నాశనం చేశాయి. అయితే, పాక్ వదిలిన మిస్సైల్స్, డ్రోన్లలో నూటికి 99 శాతం తుస్సుమన్నాయి. పాక్ వదిలిన డ్రోన్లు, మిస్సైల్స్‌ను భారత్ గాల్లోనే కట్టడి చేసింది. వాటిని పేల్చి పడేసింది. అవి కాస్తా తుస్సుమన్న రాకెట్లలా నేలపై పడిపోయాయి. నేలపై పడిపోయిన మిస్సైల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని తీసుకెళ్లిపోయారు.


అయితే, పంజాబ్‌లోని భారత్,పాక్ సరిహద్దు ప్రాంతంలో పడ్డ మిస్సైల్‌ గురించి పోలీసులకు విషయం తెలిసే లోపు ప్రజలు దాని దగ్గరకు చేరుకున్నారు. దాన్నో దీపావళి రాకెట్ అనుకున్నట్లు ఉన్నారు. అటూ, ఇటూ తిప్పుతూ హల్‌చల్ చేశారు. ఆ మిస్సైల్‌తో ఫొటోలు, వీడియోలు, సెల్ఫీలు తీసుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ పంజాబీలకు అవి ఆట వస్తువులు’.. ‘ యుద్ధం గెలిచాం.. అందుకే ఆ ట్రోఫీ ఇచ్చారు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.


బుద్ధి మార్చుకోని పాక్

భారత్, పాకిస్తాన్‌ల మధ్య యుద్ధం ముగిసింది. రెండు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందంతో రాజీకి వచ్చాయి. శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకున్నాయి. పాక్ కాళ్ల బేరానికి వచ్చి యుద్ధాన్ని ఆపేలా చేసినా.. తన బుద్ధి మాత్రం మార్చుకోవటం లేదు. మళ్లీ కాల్పుల విరమణకు తూట్లు పొడుస్తూనే ఉంది. నిన్న కూడా సరిహద్దు ప్రాంతాల్లో పాక్ రేంజర్లు కాల్పులకు తెగబడ్డారు. ఒప్పందం జరిగిన గంటల్లోనే కాల్పులు జరపటం పాక్ ఉన్మాద చర్యకు అద్దం పడుతోంది.


ఇవి కూడా చదవండి

Operation Sindoor: సైనికులను నమ్మాలి, వెంటనిలబడాలి.. శ్రీ శ్రీ అభినవ శంకర భారతి

Viral Video: హనుమాన్ చాలీసా రాగానే ఈ కుక్క ఎలా స్పందిస్తుందో చూడండి..

Updated Date - May 11 , 2025 | 11:04 AM