Share News

Viral Video: హనుమాన్ చాలీసా రాగానే ఈ కుక్క ఎలా స్పందిస్తుందో చూడండి..

ABN , Publish Date - May 11 , 2025 | 08:24 AM

Hanuman Bhakt Germanesh: రాగ్నర్ అనే కుక్క గత కొద్దిరోజులనుంచి హనుమంతుడి భక్తుడిలా మారిపోయింది. హనుమాన్ చాలీసా వస్తే చాలు.. టక్కున అలర్ట్ అవుతుంది. పాటతో పాటు గొంతు కలుపుతుంది.

Viral Video: హనుమాన్ చాలీసా రాగానే ఈ కుక్క ఎలా స్పందిస్తుందో చూడండి..
Hanuman Bhakt Germanesh

ఏవైనా పాటలు వినపడ్డప్పుడు కొన్ని కుక్కలు పాటతో గొంతు కలిపి పాడటం సాధారణంగా జరిగేదే. కుక్కలు పాటతో గొంతు కలపటం తాలూకా వీడియోలు సోషల్ మీడియాలో చాలానే వైరల్ అయ్యాయి. కానీ, ఇప్పుడు చెప్పుకోబోయే వీడియో వాటికి భిన్నమైనది. ఓ కుక్క హనుమంతుడి భక్తుడిలా మారిపోయింది. హనుమాన్ చాలీసా వినపడగానే గొంతు కలిపి పాడుతోంది. ఆ కుక్క వేరే ఏ పాటలు వచ్చినా స్పందించదు. తల కూడా తిప్పి చూడదు. కానీ, హనుమాన్ చాలీసా వస్తే మాత్రం అలర్ట్ అవుతుంది. పాటతో గొంతు కలుపుతుంది.


ఇంతకీ సంగతేంటంటే.. ‘ ది బంజారా బాయ్’ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాదారుడు ఓ జర్మన్ షెపర్డ్ కుక్కను పెంచుకుంటున్నాడు. దానికి రాగ్నర్ అని పేరు పెట్టాడు. ఆ కుక్క గత కొద్దిరోజులనుంచి హనుమంతుడి భక్తుడిలా మారిపోయింది. హనుమాన్ చాలీసా వస్తే చాలు.. టక్కున అలర్ట్ అవుతుంది. పాటతో పాటు గొంతు కలుపుతుంది. ది బంజరా బాయ్ విడుదల చేసిన వీడియోలో.. టీవీకి దగ్గరగా నేలపై జర్మన్ షెపర్డ్ రాగ్నర్ పడుకుని ఉంది. దాని యజమాని టీవీలో సినిమా పాటలు మారుస్తూ ఉన్నాడు.


మొదట డంకీ సినిమాలోని ఓ పాట ప్లే అయింది. ఆ పాటకు రాగ్నర్ స్పందించలేదు. తర్వాత శివుడికి సంబంధించిన పాట ప్లే అయింది. ఆ పాటకు కూడా రాగ్నర్ స్పందించలేదు. కొద్ది సేపటి తర్వాత హనుమాన్ చాలీసా పాట ప్లే అయింది. చాలీసా మ్యూజిక్ రాగానే రాగ్నర్ టక్కున అలర్ట్ అయింది. పాటతో పాటు గొంతు కలిపింది. తన భాషలో పాట పాడుతూనే ఉంది. ఇక, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ సనాతని షెపర్డ్’.. ‘ హనుమాన్ భక్త్ జర్మనేష్’.. ‘ పాటతో పాటు గొంతు కలిపి చాలా బాగా పాడుతోంది’.. ‘ గూస్‌బంమ్స్ వస్తున్నాయి.. జై సీతారామ్’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

US Lawyer Jailed: లేడీ లాయర్ మోస బుద్ధి.. ఏకంగా 74 కోట్లు కాజేసింది..

Operation Sindoor: ఇంకా బుద్ధిరాలేదు.. మళ్లీ అవే తప్పుడు కూతలు..

Updated Date - May 11 , 2025 | 08:24 AM