Operation Sindoor: ఇంకా బుద్ధిరాలేదు.. మళ్లీ అవే తప్పుడు కూతలు..
ABN , Publish Date - May 11 , 2025 | 06:47 AM
Operation Sindoor: నిన్న రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఆ తర్వాత త్రివిధ దళాలు దాడులను ఆపేశాయి. యుద్ధంలో పాకిస్తాన్ భారీగా నష్టపోయినా.. కాళ్ల బేరానికి వచ్చి యుద్ధాన్ని ఆపుకున్నా ఇంకా బుద్ధి రాలేదు.

గత కొద్దిరోజుల పాటు భీకరంగా సాగిన భారత్, పాకిస్తాన్ యుద్ధం ముగిసింది. నిన్న రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఆ తర్వాత త్రివిధ దళాలు దాడులను ఆపేశాయి. యుద్ధంలో పాకిస్తాన్ భారీగా నష్టపోయినా.. కాళ్ల బేరానికి వచ్చి యుద్ధాన్ని ఆపుకున్నా ఇంకా బుద్ధి రాలేదు. శనివారం యుద్ధం ముగిసిన తర్వాత పాకిస్తాన్ ప్రధాని షహ్‌బాజ్ షరీఫ్ జాతిని ఉద్దేశించి మాట్లాడారు. నమ్మశక్యం కానీ, నిజం లేని గొప్పలు చెప్పుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘ శత్రువుల ఏయిర్ బేస్‌లు, స్థావరాలను టార్గెట్ చేసి వాటిని ధ్వంసం చేశాము. వారి రాఫెల్ యుద్ధ విమానాల్ని నేల కూల్చాం.
మేమే విజయం సాధించాము. ఇది పాకిస్తానీల విజయం. పాకిస్తానీ ఆర్మీ , చైనా, టర్కీ, ఇతర ముస్లిం దేశాలకు మా కృతజ్ణతలు. ఆర్మీ చీఫ్ అసిమ్ మునిర్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు నా ధన్యవాదాలు’ అని అన్నారు. యుద్ధం ముగిసిన తర్వాత భారత్ మౌనంగా ఉంటే.. చావు దెబ్బలు తిన్న పాక్ మాత్రం తామే గెలిచామంటూ ప్రచారం చేసుకుంటోంది. పాక్ ప్రధాని వ్యాఖ్యల తాలూకా వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై స్పందిస్తున్న ఇండియన్ నెటిజన్లు కొందరు ఆయనపై సీరియస్ అవుతుంటే .. మరికొందరు నవ్వుకుంటున్నారు.
ఉగ్రదాడి జరిగితే యుద్ధమే..
పహల్గామ్ ఉగ్రదాడికి సమాధానంగా భారత్ యుద్ధానికి దిగింది. పాకిస్తాన్ కాళ్ల బేరానికి రావటంతో వెనక్కు తగ్గింది. కాల్పుల విరమణ ఒప్పందంతో రాజీకి వచ్చింది. యుద్ధాన్ని ఆపేసింది. అయితే, ఇకపై ఉగ్రదాడి జరిగితే మాత్రం సహించేది లేదని భారత్ తేల్చి చెప్పింది. ఉగ్రదాడిని ఇకపై యుద్ధంగానే భావిస్తామని స్పష్టం చేసింది. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా రెడ్‌లైన్ గీయాలని, పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాదులు మరోసారి భారత్‌ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తే.. పహల్గాం ఘటన తర్వాత స్పందించిన విధంగానే స్పందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఇవి కూడా చదవండి
రెవెన్యూ ఉద్యోగులపై తీవ్ర ఒత్తిడి: బొప్పరాజు
సమాచార కమిషనర్లుగా ముగ్గురి నియామకానికి గ్రీన్‌సిగ్నల్