Share News

Operation Sindoor: సైనికులను నమ్మాలి, వెంటనిలబడాలి.. శ్రీ శ్రీ అభినవ శంకర భారతి

ABN , Publish Date - May 11 , 2025 | 10:32 AM

Sri Sri Abhinava Shankara Bharathi Comments: పాకిస్తాన్, భారత్‌ల మధ్య జరుగుతున్న యుద్ధంపై శృంగేరి శారదా పీఠానికి చెందిన శ్రీ శ్రీ అభినవ శంకర భారతి స్పందించారు. యుద్ధంపై నిర్ణయాలు తీసుకునే వారిని.. యుద్ధ భూమిలో పోరాడే సైనికులను నమ్మటం.. వారి వెంట నిలబడటం ప్రతీ పౌరుడి బాధ్యత అని అన్నారు.

Operation Sindoor: సైనికులను నమ్మాలి, వెంటనిలబడాలి.. శ్రీ శ్రీ అభినవ శంకర భారతి
Sri Sri Abhinava Shankara Bharathi

శృంగేరి శారదా పీఠానికి చెందిన శ్రీ శ్రీ అభినవ శంకర భారతి.. పాకిస్తాన్, భారత్‌ల మధ్య జరుగుతున్న యుద్ధంపై స్పందించారు. భారత పౌరులకు యుద్ధం విషయంలో హిత బోధ చేశారు. ఆయన స్పందిస్తూ.. యుద్ధానికి సంబంధించిన అన్ని వివరాలు ప్రభుత్వం గానీ, మిలటరీ గానీ బయటకు చెబుతుందని ఎప్పుడూ ఆశించకండి. కొన్ని సార్లు బాధ్యతలను దృష్టిలో పెట్టుకుని కుటుంబంలోని వారికే చెప్పటం కుదరదు.

ఏ గొడవలోనైనా.. రెండు వర్గాలు సైకలాజికల్‌గా కూడా యుద్ధం చేయాల్సి వస్తుంది. నిర్ణయాలు తీసుకునే వారిని.. యుద్ధ భూమిలో పోరాడే సైనికులను నమ్మటం.. వారి వెంట నిలబడటం ప్రతీ పౌరుడి బాధ్యత. అన్నీ తెలుసుకోవాలని అనుకోకండి. మీరు విన్న ప్రతీ విషయాన్ని ప్రచారం చేయకండి’ అని అన్నారు.


ఇవి కూడా చదవండి

Gold Rate Today: పసిడి ప్రియులకు అలర్ట్.. నిలకడగా బంగారం ధరలు

Viral Video: హనుమాన్ చాలీసా రాగానే ఈ కుక్క ఎలా స్పందిస్తుందో చూడండి..

Updated Date - May 11 , 2025 | 10:32 AM