ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అయ్యారే.. అఫ్గాన్‌ బ్రూస్‌లీ..

ABN, Publish Date - May 11 , 2025 | 10:16 AM

వీళ్లిద్దర్నీ ఇలా చూస్తే.. ‘ఎవరు బ్రూస్‌లీ?’ అని తికమక పడటం ఖాయం. ఆ కరాటేకింగ్‌లా పంచ్‌లు కొడతాడో లేదో కానీ.. అబ్బాస్‌ అలీజాదా మాత్రం అచ్చం బ్రూస్‌లీ లాగే ఉన్నాడు. అందుకే ఆయన ఆఫ్గనిస్తాన్‌ బ్రూస్‌లీగా పేరు తెచ్చుకున్నాడు..

వీళ్లిద్దర్నీ ఇలా చూస్తే.. ‘ఎవరు బ్రూస్‌లీ?’ అని తికమక పడటం ఖాయం. ఆ కరాటేకింగ్‌లా పంచ్‌లు కొడతాడో లేదో కానీ.. అబ్బాస్‌ అలీజాదా మాత్రం అచ్చం బ్రూస్‌లీ లాగే ఉన్నాడు. అందుకే ఆయన ఆఫ్గనిస్తాన్‌ బ్రూస్‌లీగా పేరు తెచ్చుకున్నాడు..

అబ్బాస్‌ అలీజాదా ఎంత ఫేమస్సు అంటే.. కాబూల్‌కెళ్లి ఎవరినైనా.. ‘అఫ్గాన్‌ బ్రూస్‌లీ ఇల్లు ఎక్కడ?’ అనడిగితే చాలు. ఆయన ఇంటికెళ్లి మరీ అడ్రస్సు చూపించేంత ఫేమస్సు. అసలైన బ్రూస్‌లీని ప్రపంచం మెచ్చితే.. ‘అఫ్గాన్‌ బ్రూస్‌లీ’ని అరబ్బు దేశాలన్నీ అక్కున చేర్చుకున్నాయి. ఆఫ్గనిస్తాన్‌, పాకిస్తాన్‌, ఇరాన్‌తో పాటు అనేక దేశాలకు ఇప్పుడాయన ఓ మోస్తరు సెలబ్రిటీ. ఆఫ్గనిస్తాన్‌ రాజధాని కాబూల్‌ వెలుపల నిరుపేద కుటుంబంలో పుట్టిన అబ్బాస్‌కు నలుగురు సోదరులు, ముగ్గురు సోదరీ మణులు. ‘నాన్నా.. నన్ను అందరూ బ్రూస్‌లీలా ఉన్నావంటున్నారు’ అని తండ్రితో చెప్పాడొక రోజు. అయితే బ్రూస్‌లీలా కరాటే నేర్చుకోమన్నాడు తండ్రి.


2014లో బ్రూస్‌లీలా పోజు పెట్టిన అబ్బాస్‌ ఫొటోలను సరదాగా ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు అతని స్నేహితులు. ‘భయ్యా.. నువ్వు అచ్చం బ్రూస్‌లీలా ఉన్నావు’ అంటూ కామెంట్లు, లైక్‌లతో అభినందించారు నెటిజన్లు. అలా రాత్రికి రాత్రే తెగ పాపులరైపోయాడు. సినిమాలు, టీవీ కార్యక్రమాలలో చకచకా వేషాలు వచ్చాయి. ప్రముఖులతో పర్యటించే అరుదైన అవకాశం వచ్చింది. ఏకంగా హాలీవుడ్‌ వాళ్లే రమ్మన్నారు. అబ్బాస్‌ అలీజాదా ఎనిమిదేళ్ల వయసున్నప్పుడే బ్రూస్‌లీ సినిమాలు చూడటం అలవాటైంది. ‘ఫిస్ట్‌ ఆఫ్‌ ఫ్యూరీ’, ‘ద బిగ్‌బాస్‌’, ‘ఎంటర్‌ ద డ్రాగన్‌’ ఎన్నిసార్లు చూశాడో లెక్కలేదు. అందులో ఏదో ఒక సినిమా చూడందే రోజు గడవదు.


ఇంత పాపులరైన అబ్బాస్‌ జీవితం ఎప్పుడూ సంతోషంగా లేదు. ఆఫ్గనిస్తాన్‌లో మైనారిటీలైన హజారా (షియా) తెగకు చెందిన ఆయన అనేక సార్లు హింసను, వివక్షను ఎదుర్కొన్నాడు. హజారాజత్‌ ప్రాంతంలో వీరి జనాభా ఎక్కువ. ఆఫ్గనిస్తాన్‌తో పాటు ఇరాన్‌, పాకిస్తాన్‌లలో స్థిరపడ్డారు హజారాలు. వీరి మూలాలు టర్కీ, మంగోలియాలలో ఉన్నట్లు చెబుతున్నారు చరిత్రకారులు. అక్కడి నుంచి వలసవెళ్లి చాలాచోట్ల స్థిరపడ్డారు.

ఆఫ్గనిస్తాన్‌ తాలిబన్ల ఏలుబడిలో ఉన్నప్పుడు సినిమాలు, టీవీలు నిషేధం. దొంగ చాటుగా చూసేవాడు అబ్బాస్‌. నిబంధనను అతిక్రమించిన వాళ్ల కాళ్లు, చేతులు నరికారని పేర్కొన్నాడాయన. చావుభయంతో బిక్కు బిక్కుమంటూ బతికినట్లు చెప్పాడు. తన భార్య కూడా కరాటే నేర్చుకుంది. ఆమె బ్రౌన్‌బెల్ట్‌. మహిళలకు తాలిబన్లు స్వేచ్ఛ లేకుండా చేసినా సరే.. కరాటే నేర్చుకుందామె.


తాలిబన్లను భరించలేక ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్‌కు మకాం మార్చేశాడు అబ్బాస్‌ అలీజాదా. ‘ఏ రోజు అయినా మా పిల్లల్ని నా జన్మభూమికి తీసుకెళతాను. తాలిబన్ల రాజ్యం పోయాక ఇదీ నా ఊరు అని చూపిస్తాను’’ అంటూ మాతృభూమిపై మమకారం చాటుకున్నాడాయన. ఒకసారి ఆస్ట్రేలియాకు వెళ్లినప్పుడు అఫ్గాన్‌ క్యాబ్‌డ్రైవర్‌ను అడిగాడిలా.. ‘‘నీకు అఫ్గాన్‌ బ్రూస్‌లీ తెలుసా?’’ అని. ‘‘ఎందుకు తెలీదు.. మా దేశంలో ఆయన చాలా ఫేమస్సు’’ అన్నాడా డ్రైవర్‌. కారులో ప్రయాణిస్తున్న తనను గుర్తుపట్టలేదట. ఇలాంటి సంఘటనే జర్మనీకి వెళ్లినప్పుడు కూడా జరిగింది. తన జీవితంలో అందుకున్న అతి పెద్ద అభినందన ఇదేనంటాడు నేటి బ్రూస్‌లీ.


ఈ వార్తలు కూడా చదవండి..

రూ.70 లక్షల లంచం డిమాండ్‌

ఇంకా బుద్ధిరాలేదు.. మళ్లీ అవే తప్పుడు కూతలు..

ముందుగానే నైరుతి రుతుపవనాలు

షిర్డీ సాయిబాబా మందిరంలోకి పూలదండలు, శాలువాలు బంద్‌

Read Latest Telangana News and National News

Updated Date - May 11 , 2025 | 12:10 PM