Share News

Southwest Monsoon: ముందుగానే నైరుతి రుతుపవనాలు

ABN , Publish Date - May 11 , 2025 | 05:36 AM

చల్లని కబురు ముందుగానే అందింది. మరో 17 రోజుల్లో నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించనున్నట్లు భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) తెలిపింది.

Southwest Monsoon: ముందుగానే నైరుతి రుతుపవనాలు

  • మే 27న కేరళకు : ఐఎండీ.. రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు

హైదరాబాద్‌, మే 10 (ఆంధ్రజ్యోతి): చల్లని కబురు ముందుగానే అందింది. మరో 17 రోజుల్లో నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించనున్నట్లు భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) తెలిపింది. ఈ నెల 27 నాటికే రుతుపవనాలు కేరళను తాకుతాయని పేర్కొంది. నిరుడు రుతుపవనాలు మే 30న కేరళను తాకాయి. ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.


ఐఎండీ గత 20 ఏళ్లుగా నైరుతి రాకపై అంచనాలు ఇస్తోంది. వీటికి వాస్తవంగా అవి వచ్చే సమయానికి 4 నుంచి 7 రోజుల వ్యత్యాసం ఉండవచ్చని పేర్కొంది. కాగా, తెలంగాణలో ఆది, సోమవారాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అక్కడక్కడ ఈదురుగాలులతో వర్షాలు కురవచ్చని తెలిపింది. కాగా, శనివారం మెదక్‌ జిల్లాలో అత్యధికంగా 41.7, నిజామాబాద్‌లో 41, ఆదిలాబాద్‌లో 39.8, ఖమ్మంలో 39.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు పేర్కొంది.

Updated Date - May 11 , 2025 | 05:36 AM