Shirdi Sai Baba: షిర్డీ సాయిబాబా మందిరంలోకి పూలదండలు, శాలువాలు బంద్
ABN , Publish Date - May 11 , 2025 | 05:57 AM
మహారాష్ట్రలోని షిర్డీ సాయిబాబా ఆలయ ట్రస్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. పూలదండలు, పుష్పగుచ్ఛాలతోపాటు శాలువాలను టెంపుల్ కాంప్లెక్స్‌లోకి అనుమతించవద్దని నిర్ణయించింది.

ముంబై, మే 10: మహారాష్ట్రలోని షిర్డీ సాయిబాబా ఆలయ ట్రస్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. పూలదండలు, పుష్పగుచ్ఛాలతోపాటు శాలువాలను టెంపుల్ కాంప్లెక్స్‌లోకి అనుమతించవద్దని నిర్ణయించింది. సాయిబాబా మందిరానికి గత వారం బెదిరింపు మెయిల్ వచ్చింది. ఈ నేపథ్యంలో తగు భద్రతా చర్యలకు ఉపక్రమించారు.
ఆలయంలోకి భక్తులు ప్రవేశించే ముందు క్షుణ్నంగా తనిఖీ చేయనున్నట్టు సాయి బాబా సంస్థాన్ ట్రస్ట్ సభ్యుడు గోరక్ష్ గాడిల్కర్ తెలిపారు. కాగా ఆలయంలోకి భక్తులు పూలదండలు, ప్రసాదం, కొబ్బరికాయలను తీసుకురావొద్దని ముంబైలోని సిద్ధివినాయక ఆలయం శుక్రవారం పేర్కొంది.