ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Snake Viral Video: గొర్రె పిల్లను చుట్టేసిన నాగుపాము.. చివరకు యజమాని ఎంత తెలివిగా రక్షించాడో చూడండి..

ABN, Publish Date - Jun 15 , 2025 | 11:19 AM

ఓ నాగు పాము గొర్రెల మందలోకి చొరబడుతుంది. వాటి మధ్యలోకి వెళ్లిన నాగు పాము.. చివరకు ఓ గొర్రె పిల్లను చుట్టేస్తుంది. గొర్రె పిల్ల ఎటూ కదలకుండా అలాగే నిలబడి ఉంటుంది. అయితే చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

జంతువులపై పాములు దాడి చేసే ఘటనలు, వాటి పక్కన కామ్‌గా పడుండే సంఘటనలను నిత్యం చూస్తుంటాం. కొన్నిసార్లు ఆవులు ముద్దులు పెడుతున్నా కూడా పాములు సైలెంట్‌గా ఉండడం కూడా చూస్తుంటాం. ఇంకొన్నిసార్లు పాముల బారి నుంచి జంతువులను కాపడటానికి వాటి యజమానులు ఎంతో సాహసం చేస్తుంటారు. ఇలాంటి విచిత్ర సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ నాగుపాము గొర్రె పిల్లను చుట్టేసింది. గమనించిన యజమానికి చివరకు ఎంత తెలివిగా రక్షించాడో మీరే చూడండి..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ నాగు పాము గొర్రెల మందలోకి చొరబడుతుంది. వాటి మధ్యలోకి వెళ్లిన నాగు పాము.. చివరకు (Cobra Wrapped Around The Lamb) ఓ గొర్రె పిల్లను చుట్టేస్తుంది. గొర్రె పిల్ల ఎటూ కదలకుండా అలాగే నిలబడి ఉంది. కాసేపటికి ఈ విషయాన్ని గమనించిన యజమాని.. గొర్రె పిల్లను రక్షించేందుకు దగ్గరికి వెళ్లాడు.

అయితే నాగు పాము పగడ విప్పి కాటేయడానికి రావడంతో వీలు కాదు. అయినా ఎలాగైనా గొర్రె పిల్లలను కాపాడాలనే ఉద్దేశంతో చివరకు.. ఓ ప్లాస్టిక్ పైపు తీసుకుని వచ్చాడు. మెల్లగా పైపును పాము తలపై పెట్టడంతో పాము అందులోకి వెళ్లిపోతుంది. ఆ తర్వాత ఎంతో చాకచక్యంగా తోక పట్టుకుని పామును పక్కకు లాగేశాడు. ఆ తర్వాత దాన్ని తీసుకెళ్లి దూరంగా పడేశాడు. ఇలా ఎంతో తెలివిగా ఆలోచించి, పాము బారి నుంచి గొర్రె పిల్లను కాపాడతాడు.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘గొర్రె పిల్ల ప్రాణాలు కాపాడడం గ్రేట్’.. అంటూ కొందరు, ‘పామును ఎంతో చాకచక్యంగా పట్టుకున్నాడుగా’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 250కి పైగా లైక్‌లు, 21 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

ఇవి కూడా చదవండి..

దుకాణ యజమానితో ఫన్నీ గేమ్.. చివరకు జరిగింది చూస్తే నవ్వు ఆపుకోలేరు..

పాకిస్తాన్ కాదు.. ఇది ట్యాంకిస్తాన్.. ట్రోలింగ్ మామూలుగా లేదుగా..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jun 15 , 2025 | 11:27 AM