Viral Video: పడిపోయిన గుర్రం, ఎక్కడ జంతు ప్రేమ..ఓనర్ నిర్లక్ష్యంపై పోలీసుల కేసు
ABN, Publish Date - May 02 , 2025 | 09:54 AM
మండిపోతున్న ఎండల సమయంలో దాహంతో అలసిన ఓ గుర్రం వీడియో అనేక మందిని కలచివేస్తోంది. నిస్సహాయ స్థితిలో కుప్పకూలిన దాని పట్ల యజమాని క్రూరంగా ప్రవర్తించిన విధానం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Kolkata Horse: ఎండలు మండిపోతున్నాయి. ఇలాంటి సమయంలో బయటకు వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇదే సమయంలో కోల్‌కతా నగర వీధుల్లో గుర్రం విషయంలో ఓ వ్యక్తి ప్రవర్తించిన విధానం ప్రస్తుతం చర్చనీయాశంగా మారింది. అలసిన గుర్రం విషయంలో దాని యజమాని ప్రవర్చించిన తీరు మానవత్వాన్ని మరిచినట్లుగా అనిపిస్తుంది. దాహంతో అల్లాడుతూ కింద పడిన గుర్రానికి నీటిని అందించకపోగా,కొట్టి పైకి లేపాడు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఫిర్యాదు..
ఈ వీడియోను ప్రముఖ జంతు హక్కుల సంస్థ పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ అనిమల్స్ (పీఈటీఏ) ఇండియా తమ అధికారిక 'ఎక్స్ (ట్విట్టర్)' ఖాతాలో షేర్ చేయగా, అది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నీరు లేక తీవ్రంగా బరువు తగ్గి, నొప్పితో కొట్టుమిట్టాడుతున్న గుర్రాలు పర్యాటక ఆకర్షణలు కావు. గౌరవనీయులైన మమతా బెనర్జీ గారు, స్వపన్ దేవ్‌నాథ్ గారు, కోలకతా పోలీస్ అధికారులు దయచేసి ఈ గుర్రాన్ని ఓ ఆశ్రమానికి తరలించాలని కోరారు.
కామెంట్లు..
ఇది చూసిన పలువురు మానవ అనాగరికతకు ఇది పరాకాష్ఠగా మారిందని కామెంట్లు చేస్తున్నారు. అభివృద్ధి, టూరిజం పేరుతో మృగాలను ఇబ్బంది పెడుతున్నారని అంటున్నారు. జంతువుల విషయంలో అలా ప్రవర్తించడం కరెక్టేనా అని ప్రశ్నిస్తున్నారు. మండే ఎండలో దానిపై అంత క్రూరత్వం అవసరమా అని అంటున్నారు. ప్రముఖ నటి పూజా భట్ కూడా ఈ వీడియోను షేర్ చేస్తూ, పశువుల పట్ల జరుగుతున్న అమానవీయ ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలసటతో కూలిపోయిన గుర్రాన్ని కాపాడాలని కోరారు. ఈ గుర్రపు బండ్లను తక్షణమే నిషేధించి, మానవీయమైన ఈ-కారేజ్‌లకు మారాలని సూచించారు.
గతంలో మాత్రం..
పీఈటీఏ ఫిర్యాదు ఆధారంగా ఈ ఘటనపై భవానీపూర్ పోలీస్ స్టేషన్‌లో 24.04.2025న కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో పశు క్రూరత్వ నిరోధక చట్టం (PCA Act) సహా పలు సెక్షన్ల కింద చర్యలు తీసుకున్నామని అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం ఆ గుర్రాన్ని వైద్య పర్యవేక్షణలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. శరీరంలో నీరు తగ్గిపోవడం, శక్తి లేకపోవడం వల్ల గుర్రం కుప్పకూలిందని వైద్యులు చెప్పారు. గతంలో కోలకతా వంటి నగరాల్లో పర్యాటకుల కోసం గుర్రపు బండ్లను ఉపయోగించేవారు. అయితే దీనిని కొందరు సాంప్రదాయం అని చెబుతుండగా, పీఈటీఏ, పశుసంగ సంరక్షణ కార్యకర్తలు మాత్రం దీనిని పూర్తిగా పాశవికమని వ్యతిరేకిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
Mumbai Indians: అగ్రస్థానం చేరుకున్న ముంబై ఇండియన్స్.. ఆసక్తికరంగా ప్లేఆఫ్
Bank Holidays: మే 2025లో 12 రోజులు బ్యాంకులు బంద్.. పూర్తి లిస్ట్ ఇదే
Donald Trump:100 రోజుల్లో ట్రంప్ తుఫాన్..ఒప్పందాల నుంచి ఒడిదొడుకుల దాకా..
Read More Business News and Latest Telugu News
Updated Date - May 02 , 2025 | 09:55 AM