ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Ant Smuggling Case: చీమల కోసం చీకటి వ్యాపారం..జైలు బాట పట్టిన యువకులు

ABN, Publish Date - May 09 , 2025 | 05:26 PM

గోల్డ్, సిల్వర్, డ్రగ్స్, గంజాయి సహా పలు రకాల ఉత్పత్తుల స్మగ్లింగ్ గురించి ఇది వరకు విన్నాం. కానీ మీరెప్పుడైనా చీమల స్మగ్లింగ్ గురించి విన్నారా. అదేంటి చీమలను కూడా స్మగ్లింగ్ చేస్తారా. అంటే అవుననే చెప్పవచ్చు. అలా చేసి ఇటీవల పలువురు దొరికిపోయారు. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

Ant smuggling case

అరుదైన పాములు, పక్షులు, జంతువుల స్మగ్లింగ్ గురించి ఇది వరకు చూశాం. కానీ చీమల స్మగ్లింగ్ (Ant Smuggling Case) గురించి తెలుసా మీకు. లేదా అయితే ఇక్కడ తెలుసుకుందాం. కెన్యాలో జరిగిన ఈ విచిత్రమైన కేసు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రాణి చీమలను వేల సంఖ్యలో స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నించిన నలుగురు వ్యక్తులకు కెన్యా కోర్టు ఒక సంవత్సరం జైలు శిక్ష లేదా $7,700 (సుమారు ₹6.5 లక్షలు) జరిమానా విధించింది. ఈ కేసులో ఇద్దరు బెల్జియన్లు, ఒక వియత్నామీ, ఒక కెన్యన్‌లు ఉన్నారు.


చీమల స్మగ్లింగ్ ఏంటి

వీరు యూరప్, ఆసియాలో సేల్ చేసేందుకు 5,000కి పైగా రాణి చీమలను సేకరించి స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నించారు. విషయం తెలిసిన కెన్యా ప్రభుత్వం చీమల స్మగ్లింగ్‌పై చర్యలు తీసుకుంది. గత నెలలో, కెన్యా అధికారులు ఈ నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వీరిలో ఇద్దరు బెల్జియన్ టీనేజర్లు లోర్నాయ్ డేవిడ్ (19), సెప్పే లోడెవిజ్‌క్స్ (19), ఒక వియత్నామీ డూ హంగ్ న్గుయెన్ (23), ఒక కెన్యన్ డెన్నిస్ ఎన్‌గాంగా (26) ఉన్నారు. వీరు కెన్యాలోని నైవాషా పట్టణంలో, జంతు పార్కులు, సరస్సులకు ప్రసిద్ధమైన టూరిస్ట్ హబ్‌లో రాణి చీమలను సేకరిస్తూ పట్టుబడ్డారు. ఈ చీమలు యూరప్, ఆసియాలో అమ్మడానికి ఉద్దేశించినవని అధికారులు తెలిపారు.


ఒక చీమ విలువ

ఈ నలుగురూ 2,000కి పైగా టెస్ట్ ట్యూబ్‌లలో చీమలను ప్యాక్ చేశారు. ఆ ట్యూబ్‌లలో కాటన్ నింపి చీమలు నెలల తరబడి జీవించేలా చేశారు. బెల్జియన్ల వద్ద 5,000 చీమలు, మిగిలిన ఇద్దరి వద్ద 300కి పైగా చీమలు లభ్యమయ్యాయి. ఈ చీమలు జాయింట్ ఆఫ్రికన్ హార్వెస్టర్ యాంట్స్ ప్రాంతాల్లో చాలా అరుదైనవని చెబుతున్నారు. అంతేకాదు వీటిలో ఒక చీమ విలువ యూకేలో £170 (సుమారు ₹18,000) ఉంటుందని అంటున్నారు.


ఇది హాబీ కాదు

కేసు విచారణలో భాగంగా నిందితులు తమ నేరాన్ని అంగీకరించలేదు. లోర్నాయ్ డేవిడ్, బెల్జియంలో 10 చీమల కాలనీలను కలిగి ఉన్న చీమల ఔత్సాహికుడు.. ఆంట్ గ్యాంగ్ అనే ఫేస్‌బుక్ గ్రూప్‌ సభ్యుడిగా ఉన్నాడు. అతను $200కు 2,500 చీమలను కొనుగోలు చేశానని, తన చర్యలు చట్టవిరుద్ధమని తెలియదని కోర్టుకు తెలిపాడు. సెప్పే లోడెవిజ్‌క్స్ తాను కేవలం ఎంటమాలజీ ఆసక్తితో చీమలను కొనాలనుకున్నానని, స్మగ్లింగ్ ఉద్దేశం లేదని చెప్పాడు.

తోసిపుచ్చిన కోర్టు

కానీ, మేజిస్ట్రేట్ ఎన్‌జెరీ థుకు వారి వాదనలను తోసిపుచ్చారు. కొన్ని చీమలు సేకరించడం హాబీ కావచ్చు. కానీ 5,000 రాణి చీమలను పట్టుకోవడం హాబీ కాదన్నారు. ఈ చీమలు పర్యావరణానికి విలువైనవని, వీటి స్మగ్లింగ్ పర్యావరణ వ్యవస్థను దెబ్బతీస్తుందని మేజిస్ట్రేట్ హెచ్చరించారు. అత్యాశ వల్ల ప్రపంచం ఇప్పటికే అనేక జాతులను కోల్పోయిందని, ఈ క్రమంలో పెద్ద, చిన్న జీవులను రక్షించడానికి కోర్టు తన వంతు కృషి చేస్తుందన్నారు. ఈ నేపథ్యంలో నలుగురు నిందితులకు ఒక సంవత్సరం జైలు శిక్ష లేదా $7,700 జరిమానా విధించారు.


ఇవి కూడా చదవండి

India Pakistan Tension: భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తత వేళ జమ్మూ నుంచి ఢిల్లీకి మూడు ప్రత్యేక రైళ్లు


Virat Kohli: సైనికుల సేవలకు హృదయపూర్వక ధన్యవాదాలు..జై జవాన్‌కు జై కోహ్లీ

RSS: దేశ భద్రత విషయంలో ప్రతి భారతీయుడు భాగస్వామ్యం కావాలి: ఆర్ఎస్ఎస్..

Operation Sindoor: దూకుడు పెంచిన పాక్.. మిస్సైల్స్, డ్రోన్లతో దాడులు

Operation Sindoor: భారత్, పాక్ యుద్ధం.. కిమ్ సపోర్టు ఎవరికి..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 09 , 2025 | 05:26 PM