ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

US Man Slaps Indian Youth: భారతీయుడిపై దాడి చేశాడు.. చివరికి పరుగులు తీశాడు..

ABN, Publish Date - Aug 17 , 2025 | 06:36 PM

ఓ భారతీయ యువకుడు స్థానికంగా ఉన్న స్టోర్‌లో పని చేస్తున్నాడు. ఇటీవల ఓ రోజు స్టోరు వద్ద షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. స్టోర్ వద్దకు వచ్చిన యూఎస్‌కు చెందిన ఓ వ్యక్తి.. భారతీయ యువడిని చూసి రెచ్చిపోయాడు. చివరికి ఏం జరిగిందో మీరే చూడండి..

భారతీయులు చాలా మంది పొట్ట చేత పట్టుకుని విదేశాలకు వెళ్తుంటారు. అయితే చాలా మంది అక్కడ అనేక రకాలుగా ఇబ్బంది పడుతుంటారు. కొందరు పని ఒత్తిడి తట్టుకోలేక ఇబ్బంది పడుతుంటే.. మరికొందరు జాత్యాహంకానికి గురై అవస్థలు పడుతుంటారు. భారతీయులు ఒంటరిగా కనిపిస్తే చాలు.. చాలా దేశాల్లో దాడులు చేయడం, తుపాకీలతో కాల్పులు జరపడం చూస్తున్నాం. ఇలాంటి దాడుల్లో చాలా మంది భారతీయులు ప్రాణాలు పోగొట్టుకోవడం కూడా చూస్తున్నాం. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. యూఎస్‌లో ఓ విదేశీయుడు.. భారతీయుడిపై దాడి చేసి అవమానించాడు. చివరకు అతడికి ఆ యువకుడు ఎలా బుద్ధి చెప్పాడో మీరే చూడండి..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. యూఎస్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ భారతీయ యువకుడు స్థానికంగా ఉన్న స్టోర్‌లో పని చేస్తున్నాడు. ఇటీవల ఓ రోజు స్టోరు వద్ద షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. స్టోర్ వద్దకు వచ్చిన యూఎస్‌కు చెందిన ఓ వ్యక్తి.. భారతీయ యువడిని చూసి రెచ్చిపోయాడు. అతనిది ఏ తప్పూ లేకున్నా కూడా.. పరుగెత్తుకుంటూ దగ్గరికి వెళ్లి (foreigner attacked an Indian) అతడి ముఖంపై కొట్టాడు.

విదేశీయుడు అకారణంగా దాడిచేయగానే.. ఆ యువకుడు ఒక్కసారిగా షాక్ అయ్యాడు. మళ్లీ కొట్టడానికి ప్రయత్నించగా.. ఆ యువకుడు తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అయినా ఆ విదేశీయుడు అతన్ని వదలకుండా కొట్టేందుకు ప్రయత్నించాడు. అక్కడే ఉన్న ఓ పెద్దాయన వారిస్తున్నా కూడా పట్టించుకోకుండా అతడిపై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో చివరకు ఆ యువకడికి చిర్రెత్తుకొచ్చి, లోపలికి వెళ్లి బేస్ బాల్‌కు సంబంధించిన బ్యాట్‌ను తీసుకొచ్చాడు. ఇది చూసిన ఆ విదేశీయుడు భయంతో పరుగులు తీశాడు.

ఆ యువకుడు బ్యాట్‌తో కొంత దూరం వరకూ అతన్ని వెంబడించి వదిలేశాడు. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన వారంతా సదరు భారతీయ యువకడిని అభినందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ‘ఇలాంటి వారికి ఇలాగే చేయాలి’.. అంటూ కొందరు, ‘ఇటీవల ఇలాంటి దాడులు పెరిగిపోతున్నాయి’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 41 వేలకు పైగా లైక్‌లు, 7.5 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

ఇవి కూడా చదవండి..

చేపలు పడుతున్న వ్యక్తి.. వెనుకే వెళ్లిన సింహం.. చివరకు చూస్తే..

కోతులను కర్రతో తరిమికొట్టాడు.. చివరకు జరిగింది చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Aug 17 , 2025 | 06:36 PM