విశ్వాసాల బొమ్మల పార్కు..
ABN, Publish Date - May 11 , 2025 | 12:27 PM
విశ్వాసాలు ఒక్కో దేశంలో ఒక్కోరకంగా ఉంటాయి. కొందరు చెట్టును నమ్మితే, మరికొందరు పుట్టను నమ్ముతారు. ఆస్ట్రేలియా లోని ప్రజలు మాత్రం గడ్డంతో ఉండే చిన్న మరుగుజ్జు బొమ్మలను విశ్వసిస్తారు.
అదృష్టం కోసం ఇంట్లో ఏనుగు బొమ్మలు పెట్టుకునే వారిని చూసే ఉంటారు. ఐశ్వర్యం కోసం లాఫింగ్ బుద్ధ పెట్టుకోవడం కూడా తెలుసు. తాబేలు బొమ్మ ఉంటే సకల సంపదలు సమకూరు తాయని విశ్వసించే వారున్నారు. అయితే ఆస్ట్రేలియాలోని కొందరు మాత్రం చిన్న చిన్న మరుగుజ్జు బొమ్మలు అదృష్టాన్ని తెచ్చిపెడతాయని, సంతోషాన్ని, సౌభాగ్యాన్ని అందిస్తాయని విశ్వసిస్తారు. అయితే వాటిని ఇంట్లో కాకుండా... ‘నోమ్స్‌విల్లే’ అనే ప్రదేశంలో పెట్టి వస్తుంటారు. అలా పెట్టిన రంగుల బొమ్మ లతో ఆ ప్రాంతమంతా నిండిపోయి...
చూడటానికి బొమ్మల పార్కుగా మారింది.
విశ్వాసాలు ఒక్కో దేశంలో ఒక్కోరకంగా ఉంటాయి. కొందరు చెట్టును నమ్మితే, మరికొందరు పుట్టను నమ్ముతారు. ఆస్ట్రేలియా లోని ప్రజలు మాత్రం గడ్డంతో ఉండే చిన్న మరుగుజ్జు బొమ్మలను విశ్వసిస్తారు. ఆ బొమ్మలు అదృష్టానికి సంకేతాలుగా భావిస్తారు. అక్కడి వెల్లింగ్టన్ మిల్ రోడ్డులో ఉన్న ఒక పార్కులోకి వెళితే కొన్ని వేల మరుగుజ్జు బొమ్మలు కనిపిస్తాయి. ఒక్కో బొమ్మ ఒక్కోరకంగా ఉంటుంది. ఆ ప్రదేశాన్ని ‘నోమ్స్‌విల్లే’ అంటారు. అక్కడ బొమ్మలు పెడితే అంతా మంచి జరుగుతుందని స్థానికులు నమ్ముతుంటారు. ఆరోగ్యంతో పాటు, విజయం సిద్ధిస్తుందని విశ్వసిస్తుంటారు. ముఖ్యంగా ఇల్లు, తోటలకు రక్షణ లభిస్తుందని నమ్ముతారు. సంరక్షకునిగా ఉంటూ ఇంటి యజమానికి సంతోషాన్ని, సౌభాగ్యాన్ని ఆ బొమ్మ అందిస్తుందని విశ్వసిస్తారు.
నోమ్స్‌విల్లేలో బొమ్మలు పెట్టడం అనే సంప్రదాయం ఇటీవల కాలంలో మొదల య్యిందేం కాదు. చాలా ఏళ్ల నుంచి కొనసాగు తోంది. ఆస్ట్రేలియా వాసులే కాకుండా, విదేశీ పర్యాటకులు సైతం అక్కడ బొమ్మలు పెట్టడం ఆనవాయితీగా మారింది. కొందరు బొమ్మలు పెట్టడానికి వెళితే, చాలామంది ఆ ప్రదేశాన్ని చూడటానికి వెళుతుంటారు. ప్రస్తుతం అక్కడ కొన్ని వేల బొమ్మలు ఉన్నాయి.
ఎలా మొదలైందంటే...
మొదటిసారి ఈ ప్రాంతంలో మరుగుజ్జు బొమ్మను పెట్టిందెవరో కచ్చితమైన సమాచారం లేదు. అయితే స్థానికులు మాత్రం కాథలీన్ రోస్ అనే వ్యక్తి మొదటిసారి ఒక చెట్టుతొర్రలో మరుగుజ్జు బొమ్మను పెట్టినట్టు చెబుతారు. తరువాత కొన్ని రోజులకు అక్కడ ఆశ్చర్యంగా మరిన్ని మరుగుజ్జు బొమ్మలు కనిపించాయని అంటారు. స్థానికులు దాన్నొక విశ్వాసంగా భావించి బొమ్మలు పెట్టడం ప్రారంభించారు. ఆ సంప్రదాయం అలా పెరుగుతూ వచ్చిందని చెబుతారు. ఈ మరుగుజ్జు జీవుల గురించి పూర్వం జానపద కథలలో చెప్పే వారు. వాళ్లు భూమిపై ఉన్న సంపదలను కాపాడతారని అనేవారు. పాతిపెట్టిన నిధులను కాపాడే ఆత్మలు అని పురాతన కథలలో ఉందని స్థానికులు చెబుతారు. కాలక్రమంలో అవి గడ్డం ఉన్న బొమ్మలుగా రూపాంతరం చెందాయి. వాటినే ‘నోమ్స్’ అని పిలుస్తున్నారు. వాటిని పర్యావరణ సంరక్షకులుగా కూడా చూస్తున్నారు.
పర్యాటక ప్రాంతంగా...
ఆస్ట్రేలియాలో ‘నోమ్స్‌విల్లే’ ప్రాంతం ఇప్పుడు పర్యాటక ప్రదేశంగా పేరుగాంచింది. ఏటా వేల మంది పర్యాటకులు అక్కడకు వెళ్తుంటారు. అయితే బొమ్మలు పెట్టడంలో కొన్ని నమ్మకాలున్నాయి. ఎవరైనా సరే ఇతరులు పెట్టిన బొమ్మలను కదిలించకూడదు. ఒకవేళ కదిలించడం చేస్తే హాని జరుగుతుందని విశ్వసిస్తుంటారు. అందుకే బొమ్మలన్నీ ఎక్కడివి అక్కడే ఉంటాయి. ఎవరూ కూడా వాటిని తాకరు. కదిలించే ప్రయత్నం చేయరు. నమ్మకం ఎలా ఉన్నా ఇప్పుడా ప్రదేశం రంగురంగుల బొమ్మలతో పర్యాటకులకు కనువిందు చేస్తోంది. స్థానికుల విశ్వాసం కారణంగా పర్యాటకులు కూడా బొమ్మలను తాకకుండా... కేవలం దూరం నుంచి చూసి ముచ్చటపడు తుంటారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఇంకా బుద్ధిరాలేదు.. మళ్లీ అవే తప్పుడు కూతలు..
షిర్డీ సాయిబాబా మందిరంలోకి పూలదండలు, శాలువాలు బంద్
Read Latest Telangana News and National News
Updated Date - May 11 , 2025 | 12:27 PM