ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Sparrow Viral Video: మచ్చుకైనా లేని మానవత్వానికి కనువిప్పు.. ఈ పిచ్చుక చేసిన పని చూస్తే..

ABN, Publish Date - May 05 , 2025 | 11:22 AM

ఓ పిచ్చుక రోడ్డు పక్కన నిర్జీవంగా పడి ఉంది. దాన్ని చూడగానే తోటి పిచ్చుక ఎగురుకుంటూ వచ్చి అక్కడ వాలింది. తన స్నేహితుడిలో చలనం లేకపోవడం చూసి తల్లడిల్లిపోయింది. చివరకు ఏం చేసిందో మీరే చూడండి..

రోజురోజుకూ మానవత్వం మంటగలిసిపోతున్న ప్రస్తుత సమాజంలో మనుషుల కంటే జంతువులు, పక్షులు ఎంతో మేలని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక కాకి చచ్చిపోతే వంద కాకులు చుట్టూ చేరతాయి. అలాగే తోటి జంతువు ప్రాణాపాయంలో ఉందంటే.. మిగతా జంతువులన్నీ సాయం చేసేందుకు ముందుకొస్తుంటాయి. ఇందుకు నిదర్శనంగా మన కళ్ల ముందు అనేక సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, ఇలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. చనిపోయిన పిచ్చుక వద్ద మరో పిచ్చుక నిర్వాకం చూసి అంతా.. అయ్యో పాపం.. అని అంటున్నారు..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ పిచ్చుక రోడ్డు పక్కన నిర్జీవంగా (Dead sparrow) పడి ఉంది. దాన్ని చూడగానే తోటి పిచ్చుక ఎగురుకుంటూ వచ్చి అక్కడ వాలింది. తన స్నేహితుడిలో చలనం లేకపోవడం చూసి తల్లడిల్లిపోయింది. ఎలాగైనా పైకి లేపాలనే ఉద్దేశంతో దగ్గరికి వెళ్లి ముక్కుతో తట్టి మరీ లేపడం, మీదకు ఎక్కి మరీ అటూ, ఇటూ కదిలించడం చేసింది.

Optical illusion: ఈ చిత్రంలో దాక్కున్న జింకను 10 సెకన్లలో కనుక్కుంటే.. మీ కళ్లు కత్తిలా ఉన్నట్లే..


అయినా ఆ పిచ్చుక కదలకపోవడంతో అక్కడే అటూ, ఇటూ తిరుగుతూ బాధపడుతూ కనిపించింది. ఇలా ఆ పిచ్చుక చాలా సేపు అక్కడే తిరుగుతూ తన స్నేహితుడు పైకి లేస్తాడేమో అని ఎదురుచూస్తూనే ఉంది. ఈ పిచ్చుక పడిన తాపత్రయం.. అక్కడున్న వారందరి హృదయాలనూ కదిలించింది. ఈ ఘటనను కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Monkey Funny Video: సెల్ఫీ తీసుకునే ముందు ఆలోచించాలనేది ఇందుకే.. ఈమెకు ఏమైందో చూస్తే..


ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ పిచ్చుకను చూస్తుంటే ఎంతో బాధగా ఉంది’’.. అంటూ కొందరు, ‘‘ఈ పిచ్చకను అంతా ఆదర్శంగా తీసుకోవాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా లైక్‌లు, 9.6 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Bull Viral Video: పేరుకే ఎద్దు.. ప్రవర్తనలో కాదు.. నీళ్లు ఎలా తాగుతుందో చూస్తే..


ఇవి కూడా చదవండి..

Woman Funny Video: కాళ్లను ఇలా ఎవరైనా కడుగుతారా.. ఈ యువతికి చివరికి ఏమైందో చూస్తే..

Food Funny Video: విందులో వింత నిర్వాకం.. ఈ అతిథులు చేసిన నిర్వాకం చూస్తే అవాక్కవ్వాల్సిందే..

Stunts Viral Video: చావు అంచుల దాకా వెళ్లడమంటే ఇదే.. వ్యూస్ కోసం వీళ్ల నిర్వాకం చూస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - May 05 , 2025 | 11:22 AM