ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: ఇలాంటి ఉద్యోగిని ఎక్కడైనా చూశారా.. బాస్‌కు ఎలా మస్కా కొడుతున్నాడంటే..

ABN, Publish Date - May 17 , 2025 | 09:23 AM

ఆఫీసులో ఓ ఉద్యోగి తన ల్యాప్‌టాప్ ముందు కూర్చుని పని చేసుకుంటాడు. అయితే ఇది చూసేవారికి మాత్రమే.. తీక్షణంగా పరిశీలిస్తే.. అతను ల్యాప్‌టాప్‌లో పబ్జీ గేమ్ ఆడుతుంటాడు. అయితే ఇంతలో..

కొందరు ఉద్యోగులు పక్క విషయాలతో పని లేకుండా తమ పని తాము చేసుకుంటూ పోతుంటారు. ఇంకొందరు ఉద్యోగులు పని పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ పైకి మాత్రం ఎంతో కష్టపడుతునట్లు తమ బాస్‌ల ముందు కలరింగ్ ఇస్తుంటారు. అలాగే ఇంకొందరు తమ బాస్‌ల కళ్లుగప్పి చేయరాని పనులన్నీ చేసేస్తుంటారు. ఇలాంటి తమాషా సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ ఉద్యోగి తన బాస్‌‌ను ఎలా మోసం చేస్తున్నాడో చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియోను చూసిన వారంతా.. ‘‘ఎంప్లాయ్ ఆఫ్ ద ఇయర్.. అంటే ఇతనే’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఆఫీసులో ఓ ఉద్యోగి తన ల్యాప్‌టాప్ ముందు కూర్చుని పని చేసుకుంటాడు. అయితే ఇది చూసేవారికి మాత్రమే.. తీక్షణంగా పరిశీలిస్తే.. అతను ల్యాప్‌టాప్‌లో పబ్జీ గేమ్ (Pubg Game) ఆడుతుంటాడు. అయితే ఇంతలో తన బాస్ అక్కడికి వస్తాడు. అతను రావడాన్ని గమనించిన ఉద్యోగి.. వెంటనే ల్యాప్‌టాప్‌లో ఆఫీసు పని చేస్తున్నట్లు నటిస్తాడు.

Monkey Attack Video: వామ్మో.. కుక్కల్లా మారిన కోతులు.. వృద్ధురాలిని చుట్టుముట్టి మరీ..


సిన్సియర్‌గా పని చేసుకుంటున్నాడని అనుకున్న బాస్.. కాస్త ముందుకు కదులుతాడు. తన బాస్ ఇలా పక్కకు తిరగ్గానే తన ల్యాప్‌టాప్‌లో యథావిధగా పబ్జీ గేమ్ ఆడడం స్టార్ట్ చేస్తాడు. అయితే అతడిపై బాస్‌కు అనుమానం వచ్చి.. వెంటనే వెనక్కి వచ్చి ల్యాప్‌టాప్ వైపు చూస్తాడు. అయితే అప్పటికే అతను గేమ్ క్లోజ్ చేసి, పని చేస్తున్నట్లు బిల్డప్ ఇస్తాడు.

Elephant Sad Video: అయ్యో.. ఈ ఏనుగుకు ఎంత కష్టమొచ్చిందీ.. రోడ్డుపై ట్రక్కు వద్ద ఏం చేస్తుందో చూస్తే..


ఇలా ఆ బాస్ ఎన్నిసార్లు ప్రయత్నించినా అతడి కళ్లుగప్పి గేమ్ ఆడుతూనే, వర్క్ చేస్తున్నట్లు నటిస్తుంటాడన్నమాట. చూస్తుంటే ఇదంతా నవ్వుకోవడానికి చేసినట్లు అనిపించినా.. ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఉత్తమ ఉద్యోగి అవార్డ్ ఇతడికే ఇవ్వాలి’’.. అంటూ కొందరు, ‘‘ఇండియాలో ఉద్యోగులు చాలా వరకూ ఇలాగే తయారయ్యారు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 5,900కి పైగా లైక్‌లు, 7.67 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Funny Viral Video: ఇలాంటి అదృష్టం ఎంతమందికి వస్తుందీ.. ఎలా వడ్డిస్తున్నారో చూడండి..


ఇవి కూడా చదవండి..

Python VS Leopard: పులిని మింగాలని చూసిన కొండచిలువ.. చివరికి జరిగింది చూస్తే అవాక్కవ్వాల్సిందే..

Monkey Funny Video: కొమ్మ చివరన కోతి.. పండు ఎలా కోసిందో చూస్తే..

Food Funny Video: విందులో వింత నిర్వాకం.. ఈ అతిథులు చేసిన నిర్వాకం చూస్తే అవాక్కవ్వాల్సిందే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - May 17 , 2025 | 09:40 AM