ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Elephant Viral Video: అడవిలో ఎంజాయ్ చేస్తున్న పర్యాటకులు.. సడన్‌గా దూసుకొచ్చిన ఏనుగు.. చివరకు..

ABN, Publish Date - Jun 14 , 2025 | 07:58 AM

చాలా మంది పర్యాటకులు అడవిలోకి విహార యాత్రకు వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు. కొందరు పారుతున్న నీటి వద్ద సరదాగా గడుపుతుండగా.. మరికొందరు అక్కడే వంట పనుల్లో నిమగ్నమై ఉంటారు. ఇలా వారంతా ఎంతో సరదాగా గడుపుతున్న సమయంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది..

ఏనుగులకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అడవుల నుంచి రోడ్ల మీదకు వచ్చే ఏనుగులు వాహనదారులను హడలెత్తించడం చూస్తుంటాం. అలాగే మరికొన్ని ఏనుగులు వాహనాల్లోని ఆహార పదార్థాలను బలవంతంగా లాక్కోవడం కూడా చూస్తుంటాం. ఇంకొన్ని ఏనుగులైతే.. ఏకంగా గ్రామాల్లోకి చొరబడి బీభత్సం సృష్టించడం కూడా జరుగుతుంటుంది. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తూనే ఉంటాం. తాజాగా, పర్యాటకులను హడలెత్తించిన ఓ ఏనుగు వీడియో తెగ వైరల్ అవుతోంది. పర్యాటకులు పిక్‌నిక్‌లో ఎంజాయ్ చేస్తుండగా.. ఓ ఏనుగు సడన్‌గా వారి పైకి దూసుకొచ్చింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. చాలా మంది పర్యాటకులు అడవిలోకి విహార యాత్రకు వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు. కొందరు పారుతున్న నీటి వద్ద సరదాగా గడుపుతుండగా.. మరికొందరు ఒడ్డున ఫొటోలు తీసుకుంటుంటారు. ఇంకొందరు అక్కడే వంట పనుల్లో నిమగ్నమై ఉంటారు. ఇలా వారంతా ఎంతో సరదాగా గడుపుతున్న సమయంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది.

ఓ పెద్ద ఏనుగు అడవిలో నుంచి ఘీంకరిస్తూ అటుగా వస్తుంది. ఏనుగు రావడాన్ని చూడగానే అక్కడున్న వారంతా (Tourists ran after seeing an elephant) కేకలు వేస్తూ అటూ, ఇటూ పరుగులు తీశారు. వేగంగా అక్కడికి వచ్చిన ఏనుగు.. ఏమనుకుందో ఏమో గానీ.. చివరకు వారిపై దాడి చేయకుండా నేరుగా వెళ్లిపోతుంది. ఈ క్రమంలో నీటిలోకి దిగిన ఏనుగు.. అక్కడున్న కారుపై దాడి చేస్తుందేమో అని అంతా అనుకుంటారు. కానీ అలాంటిదేమీ చేయకుండా నేరుగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

ఏనుగు వెళ్లిపోవడంతో వారంతా హమ్మయ్య.. అనుకుంటూ ఊపిరి పీల్చుకుంటారు. ఈ ఘటనను కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘పర్యాటకులను హడలెత్తించిన ఏనుగు’.. అంటూ కొందరు, ‘వీరి టైం ఎంతో బాగుంది’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 6,800కి పైగా లైక్‌లు, 3.73 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

ఇవి కూడా చదవండి..

దుకాణ యజమానితో ఫన్నీ గేమ్.. చివరకు జరిగింది చూస్తే నవ్వు ఆపుకోలేరు..

పాకిస్తాన్ కాదు.. ఇది ట్యాంకిస్తాన్.. ట్రోలింగ్ మామూలుగా లేదుగా..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jun 14 , 2025 | 07:59 AM