Clothing Store Scam: ఇలాంటి మోసం మీరెక్కడా చూసుండరు.. దుస్తుల షాపులోకి దూరిన దొంగ..
ABN, Publish Date - Jul 10 , 2025 | 10:31 AM
దుస్తుల షాపులో ప్రవేశించిన ఓ దొంగ అటు షాపు యజమానికి, ఇటు కస్టమర్‌కు ఒకేసారి ఝలకిస్తూ డబ్బుతో ఉడాయించిన షాకింగ్ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసి జనాలు షాకైపోతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: దుస్తుల షాపు యజమానికి, కస్టమర్‌కూ ఒకేసారి టోపీ పెట్టి నగదుతో ఉడాయించిన ఓ దొంగ ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. వీడియోలోని దొంగ తెలివితేటలు చూసి జనాలు షాకైపోతున్నారు. దొంగలు మరీ ఇంతలా తెలివిమీరి పోతున్నారేంటో అని అంటూ నోరెళ్లబెడుతున్నారు.
@theindianbreakdown అనే ఇన్‌స్టా అకౌంట్‌లో ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఓ కుర్రాడు దుస్తుల షాపులోకి వచ్చి ఊహించని విధంగా డబ్బులు కాజేసి పారిపోయాడు. అతడి ఉదంతం మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యింది.
దొంగ మొదట వచ్చి దుస్తుల దుకాణంలోని ఓ టేబుల్‌పై కూర్చున్నాడు. టేబుల్ చుట్టూ కస్టమర్లు గుమిగూడి ఉన్నారు. ఈ క్రమంలో కస్టమర్‌లా దొంగ నటిస్తూ షాపులోని సిబ్బందిని కొన్ని దుస్తులు తీసి చూపించమని అడిగాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన కస్టమర్‌లతో మాట్లాడుతూ.. తానూ షాపు సిబ్బందిలో ఒకడిననే అభిప్రాయం కలిగించేలా ప్రవర్తించాడు. ఈ క్రమంలో సిబ్బంది అటువైపు తిరగగానే ఓ మహిళా కస్టమర్‌ను డబ్బు అడిగాడు. సిబ్బంది కంట పడకుండా ఆ డబ్బు తీసుకున్న వెంటనే అక్కడి నుంచి ఉడాయించాడు. అతడు డబ్బుతో బయటకు వెళ్లిపోయినా ఎవరికీ అనుమానం రాలేదు. ఆ తరువాత జరిగిన విషయం తెలిశాక అటు షాపు యజమాని, ఇటు సిబ్బంది, కస్టమర్లకు దిమ్మతిరిగినంత పనైంది.
ఇక ఈ వీడియోపై నెటిజెన్లు పెద్దఎత్తున స్పందిస్తున్నారు. దొంగ తెలివితేటలు చూసి షాకైపోతున్నారు. ‘ఇతడు దొంగ కాదు.. దొరలా డబ్బుతో దర్జాగా జంపైపోయాడు’ అని ఓ వ్యక్తి కామెంట్ చేశారు. అటు కస్టమర్‌కు.. ఇటు షాపు యజమానికి ఒకేసారి టోపీ పెట్టడం తామెక్కడా చూడలేదని మరికొందరు ఆశ్చర్యపోయారు. దొంగల తెలివి మితిమీరి పోతోందని ఇంకొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారి బారిన పడితే జేబులు ఖాళీ అవడం పక్కా అని హెచ్చరించారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం తెగ ట్రెండవుతోంది. మరి మీరూ ఈ వీడియోపై ఓ లుక్కేయండి.
ఇవీ చదవండి:
ఈ కుర్రాడు ప్రపంచవ్యాప్తంగా వైరల్.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..
నా కుటుంబాన్నే అవమానిస్తారా.. నెట్టింట డాక్టర్‌తో భారత్ చెస్ గ్రాండ్‌మాస్టర్ వాగ్వాదం
Updated Date - Jul 10 , 2025 | 11:17 AM